Thondwalkar: స్వీపర్‌గా పని చేసిన బ్యాంకులోనే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగిన మహిళ..!
జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. మనం లైఫ్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే.. దేవుడే మన లైఫ్ ను ప్లాన్ చేస్తాడు. ఇలానే ఓ మహిళ బ్యాంకులో స్వీపర్ గా జాయిన్ అయింది. కొద్ది సంవత్సరాల తర్వాతే అదే బ్యాంకులో అసిస్టెంట్ జనరనల్ మేనేజర్ అయింది. ఈ స్థాయికి చేరుకోవడంలో ఆ మహిళ పట్టుదల, కృషి చాలానే ఉంది. మన పట్టుదల, భగవంతుడి అనుగ్రహం ఏదైనా సాధించవచ్చని ఆ మహిళా మణి నిరూపించారు. ఇంతకీ ఆ మహిళ ఎవరూ.. స్వీపర్ నుంచి జనరల్ మేనేజర్ స్థాయికి ఎలా ఎదిగిందో చూద్దాం. మహారాష్ట్రంలోని ముంబైకి కొంత దూరంలో ఉన్న గ్రామంలో నిరుపేద కుటుంబంలో ఓ ఆడ బిడ్డ పుట్టింది.
తల్లిదండ్రులు ఆమెకు తోండ్వాల్కర్ అని పేరు పెట్టారు. ఆమెకు చదువు అంటే చాలా ఇష్టం. అది గమనించిన తల్లిదండ్రులు ఆమెను బడికి పంపారు. ఆర్థిక పరిస్థితులు దిగజారడంతో ఆమెను స్కూల్ మాన్పించి.. పనికి పంపారు. ఆ తర్వాత 17 ఏళ్ల వయసులోనే ఆమెకు పెళ్లి చేశారు. ఆమె సదాశివ్ అనే వ్యక్తిని పెళ్లాడింది. సదాశివ్ ముంబైలోని ఓ స్టేట్ బ్యాంక్ ఇండియా బ్రాంచ్ లో బుక్ బైండర్ గా పని చేసేవాడు. ఈ క్రమంలోనే వారికి ఓ బాబు పుట్టాడు. ఒక రోజు వీరి కుటుంబం బస్సులో ప్రయాణం చేస్తుండగా.. రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సదాశివ్ చనిపోయారు. దీంతో తండ్వాల్కర్ 20 వయస్సులో భర్తను కోల్పోయి.. కొడుతో ఒంటరైంది.

అయితే ఆమె భర్త పని చేస్తున్న బ్యాంకులోకి వెళ్లి పని కావాలని కోరింది. దీంతో దరఖాస్తు చేసుకోవాలని బ్యాంక్ మేనేజర్ చెప్పాడు. ఆమె దరఖాస్తు చేసుకుంది. దాదాపు రెండు నెలల తర్వాత అదే బ్రాంచ్ లో స్వీపర్ గా తీసుకున్నారు. ఆమె నెలకు రూ.65 జీతంతో పని చేశారు. అయితే ఆమెకు చదువు పై ఉన్న ఇష్టం పోలేదు. దీంతో సెకండ్ హ్యాండ్ 8,9, 10 తరగతుల బుక్స్ కొనుగోలు చేసి చదువుకుంది. 10 పాస్ అయింది. ఆ తర్వాత ఇంటర్, డిగ్రీ డిస్టెన్స్ లో పూర్తి చేసింది. ఈ క్రమంలోనే తన కొడుకును బండి పంపడం, ఇంటి అవసరాలు తీర్చుకోవడం కోసం కష్టపడింది. ఈ క్రమంలోనే ఎస్బీఐలో ఇంటర్నల్ పోస్టులు పడ్డాయి. దీంతో ఆమె దరఖాస్తు చేసి మొదటగా క్లార్క్ గా ఉద్యోగం సాధించారు.
ఈ క్రమంలోనే ఆమె ప్రమోద్ ను రెండో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత క్రమంగా ప్రమోషన్లు పొందారు, క్లార్క్ నుంచి నుంచి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగారు. చీపురుతో ఊడ్చిన బ్యాంకులోనే పెన్ను పట్టి ఆఫిసర్ గా మారిన తోండ్వాల్కర్ ప్రతి ఒక్కరికి ఆదర్శమే.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications