Success Story: రూ.300 ప్రారంభమైన వ్యాపారం రూ.7,890 కోట్ల సామ్రాజ్యంగా మారింది..!

రూ.300 మొదలు పెట్టిన వ్యాపారం నేడు రూ.7,890 కోట్ల సామ్రాజ్యంగా మారింది. ఓ మహిళ ఇంట్లో స్టార్ట్ చేసిన పంజాబ్‌కు చెందిన రజినీ బెక్టర్‌ ఒక్కో మెట్టు ఎక్కుతూ అందరికీ ఆదర్శంగా నిలిచారు.
రజినీ బెక్టర్‌ కరాచీలో జన్మించారు. మొదట్లో లాహోర్‌లో నివసించిన వారి కుటుంబం, ఆ తర్వాత ఢిల్లీకి తరలిపోయింది. అక్కడే ఆమె తన డిగ్రీ చదివారు. ఆమెకు 17 ఏళ్ల వయసులో లుధియానాకు చెందిన ధరంవీర్ బఖ్తర్‌ను పెళ్లి చేసుకున్నారు. పిల్లలు పుట్టిన తర్వాత రజినీ బెక్టర్‌కు బేకింగ్, వంట చేయడం అంటే చాలా ఆసక్తి. అందుకోసం, ఆమె పంజాబ్ యూనివర్సిటీలో బేకింగ్ శిక్షణ పొందింది.

ఆ తర్వాత ఆమె ఇంట్లోనే ఐస్ క్రీమ్, కేకులు, కుకీలు మొదలైనవి తయారు చేసింది. వాటిని మొదట తన స్నేహితులకు, బంధువులకు ఉచితంగా పంపించింది. ఆమె వంటకు ఆదరణ పెరగడంతో, కొంతమంది ఆమె దగ్గర ఆర్డర్లు ఇచ్చారు. ఆర్డర్ ఇచ్చిన కేక్, కుకీస్ తయరు చేయడానికి రజినీ రూ.300 లతో ఓవెన్ కొనుగోలు చేసింది. ఆమె మొదట స్థానిక పండుగలలో ఐస్ క్రీమ్, కేకులు, కుకీలు మొదలైనవి అమ్మడం మొదలు పెట్టారు. అయితే ఆర్డర్లు తక్కువగా ఉండడం, తక్కువ ధరకే కేక్స్, ఐస్ క్రీమ్స్ తక్కువ ధరలకు అడగడంతో ఎక్కువ రోజులు వ్యాపారం చేయలేకపోయారు. అప్పుడు ఆమెకు భర్త ధరంవీర్ సపోర్ట్ గా నిలిచారు.

Rajni Bector

రజినీ బెక్టర్‌ 1978లో ఐస్ క్రీమ్ వ్యాపారంలోకి వెళ్లడానికి రూ. 20,000 అందించారు. ఆ డబ్బుతో రజినీ 1985లో బ్రెడ్ తయారు చేయడం ప్రారంభించారు. ప్రారంభంలో రోజుకు 5,000 బ్రెడ్‌లను అమ్మేవారు. కాలక్రమేణా ఈ సంఖ్య 50,000కి పెరిగింది. 1990వ దశకంలో ప్రసిద్ధ ఆహార సంస్థ మెక్‌డొనాల్డ్స్ భారతదేశంలోకి ప్రవేశించింది. ఇది రజినీ బెక్టర్‌కు ఒక పెద్ద అవకాశంగా మారింది. ఆమె 1996లో మెక్‌డొనాల్డ్స్‌కు బర్గర్ బన్‌లను సరఫరా చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత అతను క్వేకర్ ఓట్స్‌తో కలిసి క్వేకర్ క్రెమికా ఫుడ్స్ అనే పేరుతో ఒక జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశారు. ఈ కంపెనీలో కెచప్, మిల్క్‌షేక్‌లు, మయోన్నైస్‌లను కూడా తయారు చేసి విక్రయించారు.

తొలుత రూ. 300 పెట్టుబడితో ప్రారంభమైన ఈ వ్యాపారం, ఆ తర్వాత "మిసెస్ పెక్టర్స్ ఫుడ్ స్పెషాలిటీస్ లిమిటెడ్" అనే పెద్ద కంపెనీగా ఆవతరించింది. కంపెనీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ, అది క్రీమికా, ఇంగ్లీష్ ఓవెన్ అనే రెండు ప్రధాన బ్రాండ్‌లను ప్రవేశపెట్టింది. వీటిలో బోర్బన్, క్రాకర్ వంటి జనాదరణ పొందిన బిస్కెట్లు ఉన్నాయి. ఈ కంపెనీ మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సీ, బర్గర్ కింగ్ వంటి సంస్థలకు బన్స్ సరఫరా చేస్తుంది. కాగా ఈ కంపెనీ 2020లో ఐపీఓగా వచ్చింది. రూ. 541 కోట్లు సమీకరించింది. ఈ మొత్తం ఇప్పుడు 198 రెట్లు పెరిగింది. నవంబర్ 2021 నాటికి, కంపెనీ మార్కెట్ విలువ రూ. 2500 కోట్లకు చేరుకుంది. ఆగస్టు 24, 2026 నాటికి, మిసెస్ పెక్టర్స్ ఫుడ్ స్పెషాలిటీస్ లిమిటెడ్ మార్కెట్ విలువ రూ. 7,890 కోట్లకు చేరుకుంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+