పూజా కాంత్ ఢిల్లీ నివసిస్తున్న ఓ సాధారణ మహిళ. ఆమె 2015 లో 'పూజా కి పొట్లీ' పేరుతో చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆమె మాక్రేమ్ ఆర్ట్ అంటే చేతితో తయారు చేసిన పర్యావరణ అనుకూల ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తోంది. పూజ ఎంబీఏ పూర్తి చేసింది. ఆమె చాలా సంవత్సరాలు కార్పొరేట్ రంగంలో పనిచేశారు. కానీ కొడుకు పుట్టాక 2012లో ఉద్యోగం మానేసింది. ఆమె తన బిడ్డకు ఎక్కువ సమయం ఇవ్వాలని నిర్ణయించుకుని ఉద్యోగం వదులుకుంది. వ్యాపారవేత్తగా ఎదిగింది.
ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఆమెకి నచ్చలేదు. 2015లో పూజా భర్త ఆమెకు స్మార్ట్ ఫోన్ ఇచ్చాడు. బోరు కొట్టకుండా ఉండాలంటే ఇంటి వ్యాపార ఆలోచన కోసం చూడమని ఆమె భర్త ఆమెను కోరాడు. పూజా ఈ కళను నేర్చుకునేందుకు ఎలాంటి శిక్షణ, వర్క్‌షాప్ చేయలేదు. అయితే యూట్యూబ్ చూసి నేర్చుకున్నట్లు పూజ తెలిపారు. అయితే ఆమెకు కళపై పూర్తి పట్టు సాధించడానికి రెండేళ్లు పట్టింది.

కళ పట్ల ఆమెకు ఉన్న ఇష్టం కారణంగా కుట్టు, ఎంబ్రాయిడరీ, నేత వంటి కళలలో ప్రావిన్యయం సాధించింది. ఉత్పత్తులను ఆకర్షణీయంగా తాయారు చేశారు. ప్లాంట్ హ్యాంగర్లు, వాల్ హ్యాంగర్లు, బెడ్ రన్నర్‌లు, టేబుల్ రన్నర్‌లు మొదలైన అలంకార వస్తువులను తయారు చేసి విక్రయించడం మొదలు పెట్టారు. దీని ద్వారా ఆమె మరింత మంది మహిళలకు పని కల్పించారు.
2012లో ఉద్యోగం వదిలే సమయానికి పూజ జీతం నెలకు రూ.30 వేలు. 2015లో 'పూజా కి పొట్లీ' ప్రారంభించినప్పుడు రోజుకు ఒకటి రెండు ఆర్డర్లు వచ్చేవి. అప్పట్లో రూ.5-6 వేలు సంపాదన వచ్చేది. కాలక్రమేణా ఇవి ప్రతి వారం సుమారు 100 ఆర్డర్‌లకు పెరిగాయి. ట్రావెల్ ఏజెన్సీని నడుపుతున్న ఆమె భర్త కూడా పూజకు ఆమె వ్యాపారంలో సహాయం చేయడం ప్రారంభించాడు. 2021 ఆర్థిక సంవత్సరంలో వెంచర్ ఆదాయం రూ. 20 లక్షలకు చేరుకుంది. ఆ తర్వాత 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.30 లక్షలకు పెరిగింది.
పూజా తన ఉత్పత్తులను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో విక్రయిస్తోంది. 'పూజా కి పొట్లీ' వెబ్‌సైట్‌తో పాటు, ఆన్‌లైన్ ఉత్పత్తులు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో, ఎట్సీ వంటి మార్కెట్‌ప్లేస్‌లలో కూడా విక్రయిస్తున్నారు. బ్రాండ్ కార్పోరేట్ ఆర్డర్‌లను కూడా పెద్దమొత్తంలో పొందుతుంది. ఆన్‌లైన్ మాధ్యమం ద్వారానే ఎక్కువ విక్రయాలు జరుగుతున్నాయని చెప్పారు. ఆమె తన వ్యాపారాన్ని రూ.5 వేలతో ప్రారంభించిన్నట్లు చెప్పారు.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications