Bengaluru News:రూ.50 పెరుగు ప్యాకెట్ రీఫండ్ కోసం.. రూ.98 వేలు కోల్పోయిన మహిళ..!

దేశంలో సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. చదువుకున్న వారే సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారు. చాలా మంది చిన్న పొరపాట్లతో భారీ మొత్తంలో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ చిన్న పొరపాటుతో దాదాపు రూ.లక్ష పోగొట్టుకుంది. బెంగళూరులో ఓ మహిళ పెరగు ప్యాకెట్ రీఫండ్ డబ్బుల కోసం ప్రయత్నం చేసి సైబర్ నేరగాళ్లకు చిక్కి డబ్బులు కోల్పోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని వసంత నగర్ ప్రాంతానికి చెందిన 56 ఏళ్ల మహిళ అక్టోబర్ 17న క్విక్ కామర్స్ యాప్ బ్లింకిట్ లో కొన్ని గ్రోసరిస్, రూ.50 పెరుగు ప్యాకెట్ ఆర్డర్ చేశారు. డెలివరీ బాయ్ వచ్చి ఆర్డర్ డెలివరీ చేసి వెళ్లాడు.

ఆ తర్వాత మహిళ ఆ వస్తువులు అన్ని చెక్ చేసుకుంది. పెరుగు ప్యాకెట్ ఓపెన్ చేయగా దుర్వాసన వచ్చింది. దీంతో అది చెడిపోయినట్లు గుర్తించింది. అయితే బ్లింకిట్ యాప్ లో చూస్తే కస్టమర్ కేర్ నంబర్ లేదు. దీంతో సదరు మహిళ బ్లింకిట్ కస్టమర్ నంబర్ కోసం గూగుల్ లో సెర్చ్ చేసింది. గూగుల్ బ్లింకిట్ కస్టమర్ కేర్ నంబర్లు అంటు రెండు నంబర్లు కనిపించాయి. అందులో ఒక నంబర్ కు ఆ మహిళ ఫోన్ చేసింది. అవతలి వ్యక్తి వెల్ కమ్ టూ బ్లింకిట్ కస్టమర్ కేర్ అంటూ పరిచయం చేసుకున్నాడు. దీంతో ఆ మహిళ అతను కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌ అని నమ్మింది. తాను బుక్ చేసిన పెరుగు ప్యాకెట్ చెడిపోయిందని వివరించింది.

Cyber Crime

దీంతో అవతలి వ్యక్తి పాడైన పెరుగు ప్యాకెట్ ఫొటో వాట్సాప్ నంబర్ కు పంపాలని.. మహిళ వాట్సాప్ కు ఒక లింక్ పంపాడు. దీంతో ఆ మహిళ పెరుగు ప్యాకెట్ ఫొటో తీసి ఆ లింక్ ద్వారా అప్ లోడ్ చేసింది. ఆ తర్వాత మరో వ్యక్తి పోన్ చేసి రీఫండ్ జరుగుతుందుని.. ఒకసారి గూగుల్ పే యాప్ లో బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలని కోరాడు. దీంతో మహిళ గూగుల్ పే ఓపెన్ చేసి బ్యాలెన్స్ చెక్ చేసుకున్నారు. ఆమెకు డబ్బులు క్రెడిట్ కాలేదు. అంతలోనే ఆమె బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతా నుంచి రూ.98 వేలు డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో ఆమె షాక్ అయింది. సదరు మహిళ అక్టోబర్ 23న సెంట్రల్ సైబర్ ఎకనామిక్ అండ్ నార్కోటిక్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఆమె లింక్ ఓపెన్ చేయడం వల్ల ఆమె మొబైల్ సైబర్ నేరగాళ్లు తమ ఆధీనంలో తీసుకున్నారని సైబర్ నిపుణులు చెప్పారు. ఆమె గూగుల్ పేలో బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి యూపీఐ పిన్ ఎంటర్ చేయడంతో అవతలి వారు డబ్బులు కాజేశారని వివరించారు. అందుకే లింక్ లు క్లిక్ చేయకూడదని వివరించారు. గుల్ సెర్చ్‌లో కనిపించే నంబర్లను గుడ్డిగా నమ్మకూడదని, ఏదైనా సమస్య ఉంటే నేరుగా సంబంధిత సంస్థ అధికారిక యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారానే ఫిర్యాదు చేయాలని సూచించారు. రీఫండ్ ఇస్తామని చెప్పి తెలియని వ్యక్తులు వాట్సాప్‌లో పంపే లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకూడదని స్పష్టం చేశారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+