Bengaluru News: అంబులెన్స్ ప్రాణాపాయ స్థితిలో రోగి.. వాహనం ముందు బైక్ రైడర్ల స్టంట్లు..
అంబులెన్స్ రోడ్డుపై వెళ్తుందంటే మనం సైడ్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే అంబులెన్స్ లో ప్రాణాపాయ స్థితిలో పేషెంట్ ఉంటారు కాబట్టి. ప్రధాన నరేంద్ర మోదీ గతంలో తన కాన్వాయ్ ని ఆపి అంబులెన్స్ దారి ఇచ్చిన ఘటనలు చూశాం. కానీ.. బెంగళూరులో పేషెంట్ తో వెళ్తున్న అంబులెన్స్ కు అడ్డుగా బైక్ స్టంట్లు చేశారు. అంబులెన్స్ సైడ్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. ఈ ఘటనల శనివారం తెల్లవారుజామున 2:30 గంటలకు బెంగళూరులోని గొరగుంటెపాళ్యం-యశ్వంత్‌పూర్ మార్గంలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 5 నుంచి 6 గురు బైక్స్ పై అంబులెన్స్ సైడ్ ఇవ్వకుండా.. ముందుకొస్తూ స్టంట్లు చేశారు. అంబులెన్స్ సైరన్ మోగుతున్నా.. డ్రైవర్ ఎంత హారన్ కొట్టినా వారు పట్టించుకోవడం లేదు.
అంబులెన్స్ లోని రోగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు తెలిసింది. ఈ వీడియోలో వారు పదే పదే అంబులెన్స్ ముందుకు వచ్చి స్టంట్లు చేస్తున్నట్లు కనిపించింది. కాగా బైక్ రైడర్లు హెల్మెంట్లు కూడా ధరించకుండా స్టంట్లు చేస్తున్నారు. వాహనం ముందుకు సాగడానికి కష్టపడుతుండగా అంబులెన్స్‌లోని రోగి స్ట్రెచర్‌పై పడుకుని ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎవరైతే బైక్ స్టంట్లు చేశారో వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన బాధ్యతారాహిత్యంగా, అమానవీయంగా ఉందని చాలా మంది అభివర్ణించారు.

అంబులెన్స్‌ను అడ్డుకోవడం వల్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని, దానిని తీవ్రమైన నేరంగా పరిగణించాలని పలువురు సోషల్ మీడియా వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో ప్రతి సెకను చాలా కీలకమని, కొద్దిపాటి ఆలస్యం కూడా రోగులకు ప్రాణాల మీదకు తీసుకొస్తుందని చెబుతున్నారు.
తాజా సంఘటన నిర్లక్ష్యపు రైడింగ్, చట్టవిరుద్ధమైన విన్యాసాలకు వ్యతిరేకంగా ఉందన్నారు. మరికొంత మంది నెటిజన్లు పోలీసులు ఎక్కడి వెళ్లారు. పెట్రోలింగ్ చేయాలి కదా అని ప్రశ్నిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు.


Click it and Unblock the Notifications