Bengaluru News: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్.. నవంబర్ 1న వందే భారత్ స్లీపర్ ట్రైన్ ప్రారంభం..!
బెంగళూరులు వాసులకు గుడ్ న్యూస్. బెంగళూరు, ముంబై మధ్య వందే భారత్ స్లీపర్ ట్రైన్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. కర్ణాటక రాజ్యోత్సవాలు జరుపుకునే నవంబర్ 1, 2026న ప్రారంభం కానుంది.
ఈ మార్గంలో ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తయింది. మొదటగా అక్టోబర్ చివరి వారంలో ట్రైన్ ప్రారంభిస్తారని వార్త వచ్చాయి. అయితే నవంబర్ 1న ప్రారంభించాలని నిర్ణయించనట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం అయితే.. ముంబై, బెంగళూరు మధ్య కనెక్టివిటీ పెరగనుంది. ఈ రైలు దాదాపు 16 గంటల్లో 1,118 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయనుంది.
ఈ రైలు బెంగళూరులో రాత్రి 7:50 గంటలకు ప్రారంభం అయి మరుసటి రోజు ఉదయం 11:55 గంటలకు ముంబై చేరుతుంది. బెంగళూరులోని సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ (SMVT) నుంచి బయలుదేరి, మరుసటి రోజు ముంబై CSMTకి చేరుకుంటుందని చెబుతున్నారు. తిరుగు ప్రయాణంలో ముంబై త్రి 8:10 గంటలకు ప్రారంభం అయి ఉదయం 11:55 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. ఈ రైలు వారానికి ఆరు రోజులు నడుస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ రైలు గుంతకల్లు మార్గం గుండా ప్రయాణిస్తుంది. అనంతపురం, గుంతకల్లు, రాయచూరు, కలబురగి, సోలాపూర్, పుణె మరియు కల్యాణ్ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుందని భావిస్తున్నారు.

ప్రస్తుతం సూపర్ ఫాస్ట్ రైలు సౌకర్యం లేని భారతదేశంలోని రెండు ప్రధాన నగరాల మధ్య, ఈ సేవ రైలు ప్రయాణాన్ని మరింత వేగవంతం చేస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రైళ్లలో ప్రయాణానికి ఒక్కో వైపు 22 నుండి 24 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం ఉన్న ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-ముంబై ప్రయాణాన్ని పూర్తి చేయడానికి సుమారు 22 గంటల సమయం తీసుకుంటుంది. వందే భారత్ స్లీపర్ ఈ ప్రయాణాన్ని సుమారు 16 గంటల్లో పూర్తి చేస్తుందని అంచనా, దీనివల్ల ప్రయాణికులకు దాదాపు ఆరు గంటల సమయం ఆదా కావచ్చు.
ప్రతిపాదిత బెంగళూరు-ముంబై సర్వీసులో 16 కోచ్‌ల రైలు ఉంటుందని అంచనా. ఇందులో ఏసీ త్రీ-టైర్, ఏసీ టూ-టైర్, ఏసీ ఫస్ట్ క్లాస్ అనే మూడు వసతి కేటగిరీలు ఉంటాయి. మొత్తం సుమారు 823 బెర్త్‌ల సామర్థ్యం ఉంటుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications