America: అమెరికాలోని భారత విద్యార్థులకు గుడ్ న్యూస్.. ట్రంప్ నిర్ణయాన్ని కొట్టివేసిన కోర్టు..
మధ్యంతర ఎన్నికల్లో పరాభవం పాలైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మరో షాక్ తగిలింది. ఆయనకు వ్యతిరేకంగా అక్కడి కోర్టు తీర్పు చెప్పింది. అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరటనిస్తూ అక్కడి ఫెడరల్ కోర్టు కీలక తీర్పు ప్రకటించింది. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టుల నివాస గడువు పరిమితికి సంబంధించి ట్రంప్ యంత్రాంగం తీసుకొచ్చిన సరికొత్త నిబంధనను యూఎస్ ఫెడరల్ జడ్జి కొట్టివేస్తున్నట్లు ప్రకటన చేశారు. ఎఫ్-1, జె-1, I వీసాలు ఉన్నవారికి నివాస కాలపరిమితిని భారీగా కుదిస్తూ హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం 2026లో నిబంధనలు తీసుకొచ్చింది.
నిజానికి దీనిపై సెప్టెంబర్ 14నే కోర్టు ఇంజంక్షన్ ఆర్డర్ జారీ చేసింది. ఈ నిబంధన ఏకపక్షంగా, సహేతుకత లోపం, అధికార దుర్వినియోగంతో ఉందని జడ్జి ఎఫ్ డెన్నిస్ స్లేయర్ పేర్కొన్నారు. విదేశీ విద్యార్థులకు అవకాశాలు కల్పించడం అనేది కాంగ్రెస్ పని అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. దానిని డిపార్ట్మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ అడ్డుకోవడానికి యత్నిస్తోందని చెప్పారు. F వీసాలున్న విదేశీ విద్యార్థులు, J వీసాలున్న విదేశీ పరిశోధకులు, ప్రొఫెసర్లు, I వీసాలున్న విదేశీ జర్నలిస్టులకు ఈ తీర్పుతో ఆనందంలో మునిగిపోయారు. పాత నిబంధనల ప్రకారం ఎఫ్, జే వీసాలపై వచ్చే వారు తమ కోర్సు లేదా పరిశోధన పూర్తయిన తర్వాత కూడా నిబంధనలకు లోబడి అమెరికాలో ఉండే అవకాశం ఉండేది.

కానీ, కొత్త నిబంధనలతో విద్యార్థులు, ఎక్ఛ్సేంజ్ విజిటర్లకు 4 సంవత్సరాల గడువే ఇచ్చారు. పొడిగింపు అవసరమైతే మళ్లీ ఇమిగ్రేషన్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని నిబంధనల్లో పేర్కొన్నారు. విదేశీ జర్నలిస్టులకు గతంలో 5 ఏళ్ల వరకు అవకాశం ఉండేది. దానిని 240 రోజులకు కుదిస్తూ ట్రంప్ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇక చైనా జర్నలిస్టులకు దీనిని 90 రోజులకే పరిమితం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ట్రంప్ ఉత్తర్వులపై కోర్టుకు వెళ్లారు. దీనిపై విచారిస్తున్న కోర్టు సెప్టెంబర్ 14న ఇంజక్షన్ ఆర్డర్ జారీ చేసింది. తాజాగా ట్రంప్ తీసుకొచ్చిన నిబంధనలు రద్దు చేసింది. కోర్టు తీర్పుతో భారతీయ విద్యార్థులు ఎక్కువగా లబ్ధి పొందనున్నారు. ఇండియా నుంచి అమెరికా వెళ్లిన విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయంతో ఇండియా నుంచి అమెరికా వెళ్లేవారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications