Infosys: ఇన్ఫోసిస్‌కు ఎదురు దెబ్బ.. పిటిషన్ తిరస్కరించిన న్యాయస్థానం..
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు కోర్టు షాక్ ఇచ్చింది. ఇన్ఫోసిస్ మాజీ సీనియర్ ఉద్యోగి, జిల్ ప్రీజీన్ ఆరోపణలను కొట్టి వేయాలని ఇన్ఫోసిస్ దాఖలు చేసిన పిటిషన్‌ను అమెరికా కోర్టు తిరస్కరించింది. అమెరికా నియామకాల్లో వయస్సు, లింగ, జాతి వివక్ష చూపారని ఆమె ఇన్ఫోసిస్‌పై ఆరోపణలు చేస్తూ పిటిషన్ వేశారు. కంపెనీలోని సీనియర్ సిబ్బంది వయస్సు, లింగం, జాతి ఆధారంగా నియామకాల్లో వివక్షతో, పక్షపాతంగా వ్యహరించారంటూ గత ఏడాది అమెరికా కోర్టులో జిల్ ప్రీజీన్ కంప్లెంట్ చేశారు.
జాతి వివక్ష
ఈ పద్ధతి జాతి వివక్ష, చట్టవిరుద్ధమని వాదించినందుకు ఒత్తిడికి, వేధింపులకు గురిచేశారని జిల్ ప్రీజీన్ అన్నారు. జిల్ ప్రీజీన్ ఫిర్యాదుతో ఇన్ఫోసిస్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కన్సల్టింగ్ హెడ్ మార్క్ లివింగ్‌స్టన్, అప్పటి ప్రీజీన్ పార్టనర్స్ డాన్ ఆల్బ్రైట్, జెర్రీ కర్ట్జ్‌లపై కేసు నమోదు చేశారు. దీనిపై ఇన్ఫోసిస్ అభ్యర్థనను కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. ప్రీజీన్ చేసిన క్లెయిమ్‌లను విచారణకు స్వీకరిస్తూ, న్యూయార్క్‌లోని సదరన్ డిస్ట్రిక్ట్‌లోని యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్ న్యాయమూర్తి ఇన్ఫీ వాదనను తోసిపుచ్చారు.

21 రోజుల్లోగా
జిల్ ప్రీజీన్ ఆరోపణలపై వచ్చే 21 రోజుల్లోగా స్పందించాలని ఇన్ఫోసిస్ ను ఆదేశించింది. భారతీయ సంతతికి చెందిన అభ్యర్థులు, ఇంట్లో పిల్లలున్న మహిళలతోపాటు 50 ఏళ్లు పైబడిన అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆంక్షలు విధించారని జిల్ ఆరోపించారు. నియామకాల్లో వివక్ష చూపేలా తనపై ఒత్తడి చేశారని ఆమె చెప్పారు. వీటిని వ్యతిరేకించినందుకు తనను ఉద్యోగం నుంచి తొలగించారన్నారు.


Click it and Unblock the Notifications