Software: జీతం నెలకు రూ.లక్షా 60వేలు.. చెల్లించాల్సిన ఈఎంఐ రూ.లక్షా 85వేలు..
కొందరికి జీతం ఎక్కువ ఉన్నా.. అప్పుల్లో కూరుకుపోతున్నారు. సరైన ప్లాన్ లేకుండా అప్పులు చేస్తున్నారు. తాజాగా ఓ టెక్కీ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారుతుంది. ముంబైకి చెందిన ఓ టెక్కీ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు సోషల్ మీడియాలో సలహాలు సూచనలు కోరారు. కరోనా సమయంలో సరదాగా ప్రారంభించిన F&O ఆప్షన్స్ ట్రేడింగ్ చివరకు అతడిని రూ.60 లక్షల అప్పులు చేసేలా చేసింది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఏం చేయాలో తెలియక అతను రెడిట్‌లో పోస్ట్ చేశారు. అతని పోస్ట్ పై చాలా మంది స్పందించారు.
ఓ వ్యక్తి తాను ముంబైలోని ప్రముఖ ఐటీ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు చెప్పాడు. కోవిడ్ సమయంలో స్టాక్ మార్కెట్, F&O ట్రేడింగ్‌పై ఆసక్తి పెరిగిందని గుర్తు చేశాడు. మొదట సరదాగా మొదలైన ట్రేడింగ్ క్రమంగా వ్యసనంగా మారిందని వివరించాడు. నష్టాలను తిరిగి రాబట్టాలనే ప్రయత్నంలో మరింత ట్రేడింగ్ చేయడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిందన్నారు. ట్రేడింగ్ చేయడం వల్ల సుమారు రూ.80 లక్షలు నష్టపోయానని పేర్కొన్నాడు. తనకు ఇప్పుడు పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డు బిల్స్, ఎన్‌బీఎఫ్‌సీలు, లోన్ యాప్‌లకు కలిపి దాదాపు రూ.60 లక్షల అప్పు ఉందని తెలిపాడు.

తనకు నెలకు రూ.లక్షా 60వేలు జీతం వస్తున్నప్పటికీ.. ఈఎంఐలకే సుమారు రూ.లక్షా 85వేలు చెల్లించాల్సి వస్తోందన్నాడు. కుటుంబ ఖర్చులను నిర్వహించాలంటే నెలవారీ ఈఎంఐ భారాన్ని రూ.లక్షా 30వేలకు తగ్గించే మార్గం సూచించాలని నెటిజన్లకు విజ్ఞప్తి చేశాడు. కొత్త అప్పులు, లోన్ కన్సాలిడేషన్ కోసం ప్రయత్నించినా లాభం లేదని చెప్పాడు. అయితే ఇప్పటివరకు ఒక్క ఈఎంఐ కూడా డిఫాల్ట్ కాలేదని గుర్తు చేశాడు. తన భార్య, పిల్లలకు ఈ అప్పుల తెలియదన్నారు. రికవరీ ఏజెంట్లు ఇంటికి వస్తారేమోనని ఆందోళనగా ఉందని చెప్పాడు.
అతడి పోస్ట్ పై చాలా మంది స్పందిస్తున్నారు. ఓ వ్యక్తి ముందుగా అధిక వడ్డీ ఉన్న క్రెడిట్ కార్డు, లోన్ యాప్ బకాయిలను క్లియర్ చేయాలని సలహా ఇచ్చారు. అవసరమైతే నగలు, కారు వంటి ఆస్తులను అమ్మేసి.. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సహాయం తీసుకోవడం బెటరని మరో వ్యక్తి సూచించారు. లైఫ్ స్టైల్ ఖర్చులు తగ్గించుకోవడం మంచిదని మరొకరు పేర్కొన్నారు. అప్పుల గురించి భార్య కూడా చెప్పాలని సలహా ఇచ్చారు. భవిష్యత్తులో ఎఫ్అండ్ఓ ట్రేడింగ్ చేయకూడదని పేర్కొంటున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications