For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బీఎస్‌ఎన్‌ఎల్‌లో 4జీ నెట్‌వర్క్: ఆ టెక్ దిగ్గజం కన్సార్టియానికి కాంట్రాక్ట్

|

న్యూఢిల్లీ: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్‌ 4జీ నెట్‌వర్క్ పరిధి విస్తృతం కానుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంది. దేశవ్యాప్తంగా 6,000 టవర్లను అందుబాటులోకి తీసుకుని రానుంది. దీనికి అవసరమైన కాంట్రాక్ట్‌ను దేశీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజం టీసీఎస్ సారథ్యంలోని కన్సార్టియానికి అప్పగించింది. ఈ ప్రాజెక్ట్ విలువ 550 కోట్ల రూపాయలు. ఈ కాంట్రాక్ట్ ప్రతిపాదనలపై బీఎస్ఎన్ఎల్ అధికారులు, సంబంధిత కన్సార్టియం ప్రతినిధులు సంతకాలు చేశారు

అదరగొట్టిన ఫాస్టాగ్ కలెక్షన్లు: రేట్లు పెంచి భారీ టార్గెట్లు: రూ.వేల కోట్ల ఆదాయంఅదరగొట్టిన ఫాస్టాగ్ కలెక్షన్లు: రేట్లు పెంచి భారీ టార్గెట్లు: రూ.వేల కోట్ల ఆదాయం

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నెలకొల్పదలిచిన బీఎస్ఎన్ఎల్ 4జీ నెటవర్క్ టవర్ల సంఖ్య లక్షా 12 వేలు. ఇందులో 6,000 టవర్లకు చెందిన ప్యాకేజీని టీసీఎస్ సారథ్యంలోని కన్సార్టియం దక్కించుకుంది. దశలవారీగా ఈ మొబైల్ టవర్లను నెలకొల్పుతుంది ఈ కన్సార్టియం. ఎంత కాల వ్యవధిలో వాటిని ఏర్పాటు చేయాలనేది కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ నిబంధనల్లో పొందుపరిచింది. బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ ప్రాతిపదికన ఈ కాంట్రాక్ట్‌ను టీసీఎస్- కన్సార్టియానికి అప్పగించిందని తెలుస్తోంది.

A TCS-led consortium has bagged a Rs 550 crore order from BSNL for deploying 4G network

ఆయా టవర్లను నిర్మించిన అనంతరం నిర్ణీత కాలం వరకు వాటిని ఈ కన్సార్టియమే నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వం నిబంధనలను రూపొందించినట్లు చెబుతున్నారు. దీని తరువాత క్రమంగా దేశవ్యాప్తంగా లక్షా 12 వేల మొబైల్ టవర్లను నిర్మిస్తుంది కేంద్రం. దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ ప్యాకేజీలను సైతం వేర్వేరుగా జారీ చేయనుందని అంటున్నారు. ఇందులో భాగంగా- 6,000 టవర్లతో కూడిన ప్యాకేజీ కాంట్రాక్ట్‌ను టీసీఎస్‌ కన్సార్టియానికి అప్పగించింది.

దీనికి సమాంతరంగా 5జీ నెట్‌వర్క్‌ను కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంది. ఈ విషయాన్ని ఇటీవలే టెలికం శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ పార్లమెంట్‌లో ప్రకటించారు. 4జీ, 5జీ నెట్‌వర్క్‌ను బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకుని రావడానికి సమగ్ర ప్రణాళికను రూపొందించుకున్నామని స్పష్టం చేశారు. తొలివిడతలో 4జీ నెట్‌వర్క్‌ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.

English summary

బీఎస్‌ఎన్‌ఎల్‌లో 4జీ నెట్‌వర్క్: ఆ టెక్ దిగ్గజం కన్సార్టియానికి కాంట్రాక్ట్ | A TCS-led consortium has bagged a Rs 550 crore order from BSNL for deploying 4G network

A TCS-led consortium has bagged a Rs 550 crore order from BSNL for deploying indigenously-designed 4G network.
Story first published: Saturday, April 9, 2022, 11:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X