బెంగళూరు భారీ వర్షాలతో అతలాకుతలమైంది. సిలికాన్ వ్యాలీగా పేరొందిన నగరంలో ఆఫీస్ లకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డుపై నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో బయటకు రావడానికి సాధ్యం కాలేదు. చాలా ప్రాంతాల్లో మోకాలి లోతు కంటే ఎక్కువ నీరు నిలిచిపోయింది. దీంతో నగరంలో డ్రైనేజీ సిస్టం సరిగా లేక ఇల జరిగిందని విమర్శలు వస్తున్నాయి.

40 యునికార్న్ కంపెనీలు
బెంగళూరు వేలాది టెక్ స్టార్టప్‌లు, దేశంలోని 105 యునికార్న్‌లలో కనీసం 40 ఈ నగరంలోనే ఉన్నాయి. సెప్టెంబర్ 5న సుమారు ఎనిమిదేళ్లలో అత్యధిక వర్షపాతం అక్కడ నమోదైంది. గత 24 గంటల్లో నగరంలో 131.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని IMD (భారతీయ) తెలిపింది. సెప్టెంబరు 4 సాయంత్రం కురిసిన భారీ వర్షాలతో కంపెనీలు ఉద్యోగులను ఇంటికి పంపి వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చాయి.

స్టార్టప్
అర్జున్ మోహన్ అనే స్టార్టప్ కంపెనీ సీఈవో ట్రాక్టర్ లో ఆఫీస్ కు వెళ్లారు. "బెల్లందూర్ ఒక ద్వీపంలా అనిపించింది.
ఈ ప్రాంతాలలో చాలా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అక్కడ నీటి ఎద్దడి అధ్వాన్నంగా ఉంది. ఈసారి దాదాపు వారంలో రెండుసార్లు జరిగింది." అని మోహన్ జోడించారు.

3 నుంచి 5 గంటలు
"గత వారంలో నేను ఆఫీసుకు చేరుకోవడానికి 7 కి.మీ.ల విస్తీర్ణంలో 3-5 గంటల సమయం తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. సిల్క్ బోర్డ్ తర్వాత భాగం అధ్వాన్నంగా ఉంది. 3 కి.మీలు కవర్ చేయడానికి 3 గంటలకు పైగా పడుతుంది" అని ఒక ఉద్యోగి చెప్పారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications