Bengaluru News: ట్రాఫిక్ వల్ల ఇంటికెళ్లేసరికే పని అయిపోతుంది.. వైరల్ మారిన స్టార్టప్ ఓనర్ పోస్ట్..!
బెంగళూరు ప్రజనలు పీడిస్తున్న ప్రధాన సమస్య ట్రాఫిక్. ఈ ట్రాఫిక్ తో బెంగళూరు వాసులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అయితే అక్కడ మెట్రో తీసుకొచ్చినా, ఫైఓవర్లు నిర్మించినా ఫలితం లేకుండా పోతుంది. ట్రాఫిక్ సమస్య అలాగా ఉంటుంది. తాజాగా ఓ స్టార్టప్ ఫౌండర్ లింక్డ్ ఇన్ ఓ పోస్ట్ పెట్టారు. ఓ ఫొటో కూడా షేరు చేశారు. తన ఆఫీస్ లో ఖాళీ కూర్చిలను ఫొటో తీసి పెట్టారు. అయితే ఉద్యోగులు పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వారు ఆఫీస్ కు చేరుకోవడానికే కష్టపడుతున్నారు. ఇక కార్యాలయానికి వచ్చి ఏం పని చేస్తారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అప్లైడ్ ఏఐ స్టూడియో ఫౌండర్ బాల పన్నీర్ సెల్వం తన లింక్డ్ ఇన్ ఖాతాలో తన కార్యాలయంలో ఖాళీగా ఉన్న డెస్క్ ఫొటోను పోస్ట్ చేశారు. ఇక్కడ సమస్య ఉద్యోగుల్లో లేదు.. వారు కార్యాలయానికి చేరుకోవడంలో ఉందని పేర్కొన్నారు. బెంగళూరులో ఉద్యోగులు పడుతున్న ట్రాఫిక్ కష్టాల గురించి ఆయన పోస్ట్ లో వివరించారు. బెంగళూరులో ప్రయాణం సవాలుతో కూడుకున్నది ఆయన వివరించారు. చిన్న చిన్న దూరాలు చేరుకోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తుందని వాపోయారు. స్కూటీపై హెచ్ఎస్ఆర్ ప్రాంతంలో కేవలం 4 కి.మీ వెళ్లేందుకు దాదాపు 20 నిమిషాలు పట్టిందని ఆయన తెలిపారు. ఇక కారులో అయితే మరింత ఎక్కువ సమయం పడుతుందని అన్నారు.

సిటీలో పీక్ అవర్స్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని సెల్వం వివరించారు. సిగ్నల్స్ పట్టించుకోకుండా దూసుకొచ్చే వాహనాలను తప్పించుకుంటూ కార్యాలయానికి చేరుకునేసరికే ఉద్యోగులు శారీరకంగా, మెంటల్ గా అలసిపోతున్నారని వివరించారు. ఇక ఆఫీస్ కు వచ్చి ఏం పని చేస్తారని చెప్పారు. ఇక సాయంత్రం ఇంటికి వెళ్లి ఇంత తిని పడుకోవడమే తప్ప ఏం ఉండదన్నారు. అంతేకాదు ఆయనకు ఎదరైన అనుభవాన్ని కూడా వివరించారు. ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు లేని రోజున సాయంత్రం 4 గంటలకు తను వైట్ ఫీల్డ్ నుంచి హెచ్ఎస్ఆర్ వరకు 17 కిలో మీటర్ల దూరానికి 2 గంటల సమయం పట్టిందని పేర్కొన్నారు.
అది సాయంత్రం 4 గంటలకే బయల్దేరితే. ఇక సాయంత్రం 6 తర్వాత ఆఫీస్ నుంచి ఇంటికి బయల్దేరితే అంతే సంగతని పేర్కొన్నాడు. ఈ ట్రాఫిక్ సమస్య వల్ల ఉద్యోగులు వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్నారని పేర్కొన్నారు. వారికి భార్య, పిల్లలతో గడిపే సమయం ఉండడం లేదని వివరించారు. ఆయన పోస్ట్ పై బెంగళూరు వాసులు చాలా మంది స్పందించారు. ట్రాఫిక్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కామెంట్లు చేశారు. సాయంత్రం ఇంటికి వెళ్లేసారికి తమ పని అయిపోతుందని వివరించారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications