158 ఏళ్ల సంస్థ ఓ పాస్‌వర్డ్ వల్ల మూతపడింది... 700 మంది ఉద్యోగాలు కోల్పోయారు!

ఒక చిన్న నిర్లక్ష్యం ఎలా పెద్ద విపత్తుకు దారితీస్తుందో తాజా ఉదాహరణ నిలిచింది యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థ KNP Logistics Group కథ. దాదాపు 158 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సంస్థ, సైబర్ దాడికి గురై పూర్తిగా మూతపడింది. దీంతో ఒక్కసారిగా 700 మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీనికి కారణం ఆశ్చర్యంగా అనిపించినా కేవలం ఒక బలహీనమైన పాస్వర్డ్ వల్ల ఇదంతా జరిగినది.

KNP KNP Logistics Group cyberattack ransomware weak password job loss UK logistics company data encryption cybersecurity IT security unemployment company closure supply chain disruption

సైబర్‌ సెక్యూరిటీ నిపుణుల ప్రకారం, ఆ సంస్థలో ఒక ఉద్యోగి సులభంగా ఊహించగలిగే పాస్‌వర్డ్ పెట్టాడు. దాంతో హ్యాకర్లు ఆ పాస్‌వర్డ్‌ను తేలికగా గుర్తించి, వ్యవస్థలోకి ప్రవేశించగలిగారు. హాకర్లు ఆ ఉద్యోగి పాస్‌వర్డ్‌ను అంచనా వేసి, కంపెనీ అంతర్గత కంప్యూటర్ సిస్టమ్‌లోకి అక్రమంగా ప్రవేశించారు. అక్కడ వారు సంస్థ డేటాను ఎన్‌క్రిప్ట్ చేసి, సిబ్బంది కీలక సమాచారం యాక్సెస్‌ చేయలేనిలా చేసారు. హాకర్స్ డేటాని తిరిగి అందించడానికి రాన్సమ్ డబ్బుని డిమాండ్ చేశారు దాదాపు 5 మిలియన్ల పౌండ్లలో ఉండొచ్చని నిపుణులు అంచనా వేశారు.

KNP లాజిస్టిక్స్ గ్రూప్ చిన్న సంస్థ కాదు. ఇది 158 సంవత్సరాలుగా బ్రిటన్‌లో అనేక రవాణా, లాజిస్టిక్స్ అవసరాలను తీర్చిన సంస్థ. కానీ ఆ ర్యాన్సమ్‌ను చెల్లించలేకపోవడం వల్ల, వారు తమ ఆపరేషన్లను కొనసాగించలేకపోయారు. దీంతో సంస్థ మూతపడటమే కాకుండా, అందులో పనిచేస్తున్న 700 మంది ఉద్యోగులు ఒక్కసారిగా నిరుద్యోగులుగా మారిపోయారు. ఈ సంఘటన ఒక్క సంస్థ కష్టానికి మాత్రమే కాదు వేల కుటుంబాల జీవనాధారానికి ఎదురైన సమస్య.

KNP, నైట్స్ ఆఫ్ ఓల్డ్ బ్రాండ్ పేరుతో 500 లారీలను నిర్వహించేది. ఐటీ భద్రతా ప్రమాణాలు పాటిస్తూ సైబర్ అటాక్ ఇన్సూరెన్స్ కూడా ఉండే ఈ సంస్థ, అయినప్పటికీ అలా సురక్షితంగా ఉండలేకపోయింది. 700 మంది ఉద్యోగాలు ఒకేచోట నిలిచిపోయాయి. KNP డైరెక్టర్ పౌల్ అబ్బట్ ఇలా చెప్పారు, ఈ సైబర్ దాడికి ఒకే ఒక పాస్‌వర్డ్ కారణమని, కానీ బాధ్యత వహించిన ఉద్యోగికి తెలియజేయలేదన్నారు.

హ్యాకర్లు పంపిన రాన్సమ్ నోట్లో చాలా స్పష్టంగా ఇలా రాశారు "మీరు ఇది చదువుతున్నారు అంటే... మీ కంపెనీ అంతర్గత వ్యవస్థ పూర్తిగా లేదా కొంత భాగంగా పనిచేయకుండా మేము నిలిపేశాం. ఎమోషన్లు పక్కనపెట్టి, మీరు మమ్మల్ని సంప్రదించాలి, లేదంటే వ్యవస్థ తిరిగి పనిచేయదు అని చెప్పారు. ఇది ఒక తీవ్రమైన హెచ్చరికగా, మరియు మానవ జీవితాలపై ప్రభావం చూపిన మానసిక దాడిగా చెప్పవచ్చు.

ఈ ఘటన మనందరికీ ఒక మేలుకొలుపు. పెద్ద పెద్ద సంస్థలైనా, సాంకేతికంగా ముందుండే దేశాలయినా బలహీనమైన పాస్వర్డ్, సులభమైన సెటింగ్స్, రెండు దశల ధృవీకరణ (2FA) లేకపోవడం వంటివి చాలా ప్రమాదకరం. ఒక్క ఉద్యోగి చేసిన చిన్న పొరపాటు, వేల మందిని ప్రభావితం చేయగలదు.

ఈ సందర్భంగా సైబర్ సెక్యూరిటీ నిపుణులు అందరికీ సూచిస్తున్న విషయం:
1. బలహీనమైన ఒక్క పాస్‌వర్డ్ వల్ల 158 సంవత్సరాల చరిత్ర కల సంస్థ అస్తవ్యస్తం అయ్యింది.
2. 700 మంది ఉద్యోగులకి ఉద్యోగం కోల్పోవడం వంటి దురదృష్టమైన పరిణామం సంభవించింది.
3. సంస్థకు ఉన్న ఇన్సూరెన్స్, ఐటీ ప్రమాణాలతో కూడిన సెక్యూరిటీ కూడా ఈ దాడిని ఆపలేకపోయింది.
4. యూకెలో ఇలాంటి దాడులు పెరుగుతున్నాయి, సంస్థలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇలాంటి ఘటనలు గతంలో కూడా చోటు చేసుకున్నాయి. కానీ KNP Logistics కేసు ప్రత్యేకమైనది ఎందుకంటే ఇది ఒక శతాబ్దపు వారసత్వాన్ని తుడిచేసింది. కొన్ని తరం ఉద్యోగులు అక్కడే పనిచేశారు. వారి తల్లిదండ్రులు, పిల్లలు కూడా ఆ సంస్థతో సంబంధం కలిగి ఉన్నారు. అలాంటి ఒక సంస్థ, ఒకే చిన్న టెక్నికల్ లోపం వల్ల ఇక మిగలకపోవడం ఎంతో బాధాకరం.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+