ఏకంగా ఫస్ట్ క్లాసుకే 4 లక్షల ఫీజు.. ? సామాన్యుడికి భారంగా చదువు...

ప్రస్తుత కాలంలో విద్యకు పెరుగుతున్న ప్రాముఖ్యత సమాజంలో చాలా పరిణామాలను చూపిస్తుంది. ప్రతి ఒక్కరు చదువుకోవాలి, చదువుకోవడం ప్రతి ఒక్కరి హక్కు ఇలాంటి నినాదాలు వినిపిస్తున్నప్పటికీ మరోవైపు దీన్ని అవకాశంగా చేసుకొని ప్రజాల నుండి ఫీజుల పేరుతో పిండేస్తున్నారు. అందరికి విద్య అందుబాటులో ఉండేలా ఒక వైపు ప్రభుత్వం చర్యలు చేపడుతుంటే మరోవైపు కార్పొరేట్ స్కూల్ ఎడ్యుకేషన్ అంటూ వివిధ పేర్లు చెప్తూ సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు. ఒకప్పుడు ప్రజలు ఉదయం పని చేసుకుంటూ రాత్రి కొంత సమయం చదువుకి కేటాయించేవారు. ఇలా మెల్లి మెల్లిగా చదువు పై అవగాహనా పెరిగి ప్రతి ఒక్కరు చదువుకోవాలి, నిరక్షరభ్యాసులు ఉండకూడని ప్రభుత్వం పలు కార్యక్రమాలు కూడా చేసింది.

అయితే తాజాగా ఒక వ్యతి చేసిన X పోస్ట్ అందరిని ఆలోచించేలా చేసింది. సాధారణంగా చిన్న పిల్లల ఫీజులు అందరు చదువుకునేలా అందుబాటులో ఉంటే ఇప్పుడు అది కూడా ఒక వ్యాపారంగా మారింది. X పోస్ట్ ప్రకారం 1వ తరగతి ఫీజు 4 లక్షలు చెల్లించాలంటూ ఓ విద్యాసంస్థ జారీ చేసిన నోటీసును ఆ వ్యక్తి పోస్ట్ చేసారు. దింతో ఇండియాలో ని విద్య వ్యవస్థ పై Xలో తీవ్ర చర్చకు దారి తీసింది. జైపూర్‌లోని జయశ్రీ పెరువాల్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో 1 సంవత్సరానికి స్కూల్ ఫీజుగా రూ. 4 లక్షలు కట్టాలని స్కూల్ యాజమాన్యం నోటీసు పంపిందని రిషబ్ జైన్ అనే వ్యక్తి X సైట్‌లో షేర్ చేసారు. ఇందులో జాయినింగ్ ఫీజు, బస్ ఛార్జీ, బుక్స్ ఫీజు, యూనిఫాం ఫీజు ఉన్నాయి.

a school in jaipur issues notice to a parent stating first class fee was 4 lakhs

రిషబ్ జైన్ చేసిన పోస్ట్ చాలా మంది తల్లిదండ్రులకు తన ఆవేదన తెలిపేందుకు సహాయపడింది. అతని చేసిన పోస్ట్ కి కామెంట్స్ విభాగంలో కొంతమంది తల్లిదండ్రులు పెరుగుతున్న విద్య ఖర్చులపై నిరాశను తెలిపారు. ఈ పోస్ట్ ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలపై పెరుగుతున్న విద్యా ఖర్చుల ప్రభావాన్ని హైలైట్ చేస్తుంది. అతనికి పంపిన స్కూల్ ఫీజు నోటీసులోని వివరాలు చూస్తే రిజిస్ట్రేషన్ ఫీజు కోసం రూ.2,000, అడ్మిషన్ ఫీజు కోసం రూ.40,000, రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ కోసం రూ.5,000, అన్యువల్ స్కూల్ ఫీజు కోసం రూ.2,52,000, బస్ ఫీజు కోసం రూ.1,08,000, బుక్స్ ఇంకా స్కూల్ డ్రెస్ కోసం రూ.20,000 ఇలా అన్ని కలిపి సంవత్సరానికి మొత్తం రూ.4. 27,000గా చూపించింది.

ఈ లెక్కలు దేశంలో స్కూల్ విద్య కోసం చెల్లించే చార్జులు. అయితే ఏడాదికి రూ.20 లక్షలు సంపాదించినా ఇంత ఖర్చులు ఒక సామాన్యుడు భరించగలడా అనేది ప్రశ్న ? ఎందుకంటే వీటితో పాటు హెల్త్ ఇన్సూరెన్స్, ఆదాయపు పన్ను, ఈఎంఐ, పెట్రోల్‌, ఇంటి ఖర్చులు అదనంగా భరించాల్సి ఉంటుంది. ఒక్క 1st క్లాస్ కోసమే ఇన్ని లక్షలు ఖర్చు పెడితే భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివించాలంటే సుమారు కోట్లు వరకు ఖర్చు అవుతుందని, విద్య అనేది లగ్జరీ కాకుడని ఇలా చాలామంది నుండి అతను చేసిన పోస్టుకు కామెంట్స్ వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+