Unemployment: చిన్న ఉద్యోగం కోసం కిలో మీటర్ క్యూ.. ఇది దేశంలోని నిరుద్యోగానికి నిదర్శనం..!
గత రెండు మూడేళ్లుగా నిరుద్యోగం పెరిగిపోతుంది. అప్పట్లో ఐటీ నియామకాలు భారీగా జరిగేవి. కానీ ఈ మధ్య తగ్గిపోయింది. సంవత్సరానికి లక్షల మంది గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకోని బయటకు వస్తున్నారు. కానీ వారికి ఉద్యోగాలు దొరకడం లేదు. ఇందుకు తాజాగా వైరల్ అయిన ఓ వీడియో నిదర్శనం కానుంది. హైదరాబాద్‌లోని విప్రో బయట వాక్-ఇన్ ఇంటర్వ్యూ కోసం వందలాది మంది ఉద్యోగార్థులు క్యూలో నిలబడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో దేశంలోని ఉద్యోగాలు, నిరుద్యోగం, విద్యా వ్యవస్థపై చర్చకు దారి తీసింది. ఈ వీడియోలో నిరుద్యోగులు రోడ్డు పక్కన, పార్క్ చేసిన వాహనాల చుట్టూ తిరిగి కంపెనీ గేటు వరకు క్యూ లైన్ లో నిల్చనున్నారు.
హైదరాబాద్‌లోని విప్రో వాక్-ఇన్ ఇంటర్వ్యూకు మించి ఉద్యోగాలపై చర్చ కొనసాగుతోంది. ఇంజనీరింగ్, ఐటీ అత్యంత సురక్షితమైన వృత్తులు కాని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. సమాజంలో చాలా మంది వారి పిల్లలను ఇంజినీరింగ్ చేయాలని ఒత్తిడి చేస్తున్నారన గుర్తు చేస్తున్నారు. బీ.టెక్ మాత్రమే చేయదగిన డిగ్రీ అని, సాఫ్ట్వేర్ మాత్రమే గౌరవప్రదమైన వృత్తి అని విద్యార్థులకు బోధిస్తున్నారని మరొకరు కామెంట్ చేశారు. కంపెనీలు ఇప్పటికీ ఈ విధంగా వాక్-ఇన్ ఇంటర్వ్యూలు ఎందుకు నిర్వహిస్తున్నాయని కొందరు యూజర్లు పేర్కొంటున్నారు. అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయడానికి సాంకేతికతను ఉపయోగించాలని కోరుతున్నారు.

దేశంలోని అధిక జనాభాతో పాటు పరిమిత సంఖ్యలో ఉన్న ఉద్యోగాల కోసం తీవ్రమైన పోటీ ఉండటమే కారణమని పేర్కొంటున్నారు. కొందరు విద్యా వ్యవస్థను, అలాగే యువతను సంప్రదాయ వృత్తులను ఎంచుకునేలా ఒత్తిడి చేస్తున్న సామాజిక పీడను తప్పుబట్టారు. చాలామందికి ఈ వీడియో ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నారు. డిగ్రీ ఇకపై సరైన జీతంతో కూడిన మంచి ఉద్యోగానికి హామీ ఇవ్వదని గుర్తుంచుకోవాలి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications