UAE Lucky Day Draw: లాటరీలో ఏకంగా రూ.13 కోట్లు గెలుచుకున్న వ్యక్తి..!

శనివారం జరిగిన తాజా యూఏఈ లాటరీ లక్కీ డే డ్రాలో 5 మిలియన్ దిర్హమ్‌ల ద్వితీయ బహుమతి విజేతను ప్రకటించారు. ఓ విజేతకు డ్రాలో 50 లక్షల దిర్హమ్స్ వచ్చాయి. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం ఇది దాదాపు రూ.13 కోట్లు. లక్కీ డే డ్రా నెంబర్ 261003వ డ్రాలో ఇది రెండో బహుమతిగా నిర్వాహకులు తెలిపారు. అయితే గ్రాండ్ ప్రైజ్ అయిన 3 కోట్ల దిర్హమ్‌లను మాత్రం ఎవరూ గెలుచుకోలేకపోయారని తెలిపారు. తాజా డ్రాలో పాల్గొన్నవారిలో పలువురు వివిధ కేటగిరీల్లో నగదు బహుమతులను సొంతం చేసుకున్నట్లు పేర్కొంది.

లక్కీ డే డ్రా నెం. 261003 నంబర్ లో రోజుల విభాగంలో 12, 17, 4, 5, 18, 14 విజేత సంఖ్యలుగా నిలవగా.. నెలల విభాగంలో 10 మంది విజేతలుగా నిలిచారు. గ్యారెంటీడ్ లక్కీ ఛాన్స్ ఐడీ (Lucky Chance ID) బహుమతి విభాగంలో ముగ్గురు పార్టిసిపెంట్లు ఒక్కొక్కరు 50,000 దిర్హమ్‌లను కైవసం చేసుకున్నారు. విజేత లక్కీ ఛాన్స్ ఐడీలు CU7185090, AE0396336, BP4042367.మొత్తం ఆరు డేస్ నంబర్లను సరిగ్గా సరిపోల్చిన ఒక విజేత 50 లక్షల దిర్హమ్‌ల రెండో బహుమతిని సాధించాడు. 30 మిలియన్ దిర్హమ్‌ల గ్రాండ్ ప్రైజ్‌ను గెలుచుకోవడానికి అవసరమైన అన్ని సంఖ్యలను ఏ పార్టిసిపెంట్ కూడా సరిపోల్చలేదు.

Lottery

ఇదిలా ఉండగా మరో విభాగంలో ఒక ప్లేయర్ 5 మిలియన్ దిర్హమ్‌ల ద్వితీయ బహుమతిని కైవసం చేసుకున్నారు. అదనంగా ఒక పార్టిసిపెంట్ 100,000 దిర్హమ్‌ల లక్కీ డే తృతీయ బహుమతిని గెలుచుకున్నారు. గెలుపొందిన నెల సంఖ్యతో పాటు, రోజుల విభాగంలోని ఐదు సంఖ్యలను సరిపోల్చిన పాల్గొనేవారికి బహుమతి అందజేస్తారు. 7,966 మంది తలా 100 దిర్హమ్‌లు గెలుచుకున్నారు. తాజా డ్రాలో అన్ని కేటగిరీలను కలిపి మొత్తం 8,025 మంది బహుమతులు పొందారు. "ఈ రాత్రి డ్రాలో గెలిచిన మన లక్కీ డే విజేతలందరికీ అభినందనలు! ఉత్సాహం ఇక్కడితో ముగియదు" అని షో హోస్ట్ చాదీ ఖలాఫ్ అన్నారు.

లక్కీ డే డ్రా వారానికి రెండుసార్లు జరుగుతుంది యూఏఈ తదుపరి లాటరీ లక్కీ డే డ్రా అక్టోబర్ 7, బుధవారం నాడు నిర్వహించనున్నారు. పాల్గొనేవారు మరోసారి Dh30 మిలియన్ల జాక్‌పాట్‌తో పాటు, అనేక ఇతర నగదు బహుమతులను గెలుచుకునే అవకాశం ఉంటుంది. 50 లక్షల దిర్హమ్స్ గెలిచిన వ్యక్తి విషయాలు బయటకు రాలేదు. ఆ వ్యక్తి ఇండియాకు చెందిన వాడా కాదా అని తెలియరాలేదు. అయితే గతంలో కూడా కొంత మంది ఇండియన్స్ లాటరీలో భారీగా డబ్బును గెలుచుకున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+