Success Story: జేఈఈ రెండు సార్లు ఫెయిల్.. కట్ చేస్తే నెలకు రూ.2 లక్షలు సంపాదిస్తున్నాడు..

పరీక్షల్లో ఫెయిల్ అయితే జీవితంలోనే ఫెయిల్ అయినట్లు కాదని నిరూపించాడు మధ్యప్రదేశ్ ఇండోర్ కు చెందిన యువ డిజైనర్. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE)లో రెండుసార్లు విఫలమైనా జీవితయంలో విజయం సాధించారు. ఈ యువ ఇంజినీర్ కథను వ్యాపారవేత్త, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అంకుర్ వారికూ బయటకు తెచ్చారు. భారతదేశ సమస్య ప్రతిభ కొరత కాదని, ప్రతిభను గుర్తించే విధానమే అసలు సమస్య అని వాదించారు. ఆ డిజైనర్ JEE మెయిన్‌లో విఫలమయ్యాడా లేక JEE అడ్వాన్స్‌డ్‌లో విఫలమయ్యాడా అనేది అస్పష్టంగా ఉంది.

ప్రజలను వారు చదివిన విద్యాసంస్థలు, వారు పొందిన డిగ్రీలు లేదా వారు పనిచేసిన కంపెనీల ఆధారంగా తరచుగా అంచనా వేస్తారని వారికూ అన్నారు. అయితే వారి నైపుణ్యాలు మరియు సామర్థ్యానికి తక్కువ ప్రాధాన్యత లభిస్తుందని అన్నారు. సరైన కళాశాల, డిగ్రీ లేదా కంపెనీ ముద్రతో వచ్చినప్పుడు మాత్రమే ప్రతిభను గుర్తించేలా మనకు శిక్షణ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. ఈ విధానం వల్ల చాలా మంది సమర్థులైన వ్యక్తులు కనిపించకుండా పోతారని పేర్కొన్నారు. ఎందుకంటే వారి సామర్థ్యాలకు సుపరిచితమైన విద్యాపరమైన లేదా వృత్తిపరమైన గుర్తింపులు ఉండవని ఆయన వాదించారు.

success

ఈ యువ డిజైనర్ ఎలాంటి కోచింగ్ లేకుండా.. యూట్యూబ్ లో ట్యూటోరియల్స్ చూస్తూ ఎదిగాడని పేర్కొన్నారు. ఆ తర్వాత అతను ఒక డిజైన్ రూపొందించారని వివరించారు. అది ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థల నుంచి పట్టభద్రులైన వారి డిజైన్ ో పోటీ పడగలదని వారికూ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆ యువ డిజైనర్ ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తూ నెలకు 2 లక్షలు సంపాదిస్తాడని గుర్తు చేశారు. అర్హతలు, పని అనుభవం ఒక వ్యక్తి గతాన్ని వర్ణించగలవని, కానీ భవిష్యత్తులో వారు ఏమి సాధించగలరో కచ్చితంగా చెప్పాలేమని వారికూ అన్నారు. సర్టిఫికెట్లు ఒక వ్యక్తి ఎక్కడ నుంచి వచ్చాడో చెప్పగలవన్నారు. కానీ వారి ప్రతిభను చెప్పలేవని పేర్కొన్నారు.

భారతదేశం ప్రతిభకు కొరతతో బాధపడటం లేదని కానీ సంస్థాగత గుర్తింపు చిహ్నాలపై అతిగా ఆధారపడటం వల్లే ఈ సమస్య ఉందని వారికూ పేర్కొన్నారు. ఒక ప్రసిద్ధ విశ్వవిద్యాలయం పేరు, ఒక నిర్దిష్ట డిగ్రీ, లేదా ఒక కార్పొరేట్ సంస్థ వంటి వాటి మద్దతు ఉన్నప్పుడు మాత్రమే సామర్థ్యాన్ని గుర్తించేలా సమాజం అలవాటు పడిందని ఆయన వివరించారు. అయితే, వైరల్ అయిన ఈ విజయగాథతో చాలా మంది యూజర్లు కామెంట్లు చేస్తున్నారు. అనేక విజయవంతమైన భారతీయ స్టార్టప్‌లను ఐఐటి పూర్వ విద్యార్థులే స్థాపించారని, అందుకే ఐఐటియన్లు పారిశ్రామిక రంగంలో నిరంతరం ప్రత్యేకంగా నిలుస్తున్నారని ఆ యూజర్ పేర్కొన్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+