Bengaluru: ఉద్యోగం ఉంది కదా అని ఇల్లు కొన్నాడు.. ఇప్పుడు జాబ్ పోయింది..!

ఏఐ రాకతో చాలా మంది ఐటీ, నాన్ ఐటీ ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోతున్నారు. సడన్ గా లే ఆఫ్స్ కావడంతో చాలా మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీతం వస్తుందని కదా కొంత మంది కారు ఈఎంఐలో కొంటారు. హోం లోన్ తీసుకుని ఇల్లు కొనుగోలు చేస్తారు. జాబ్ పోతే.. ఈఎంఐల పరిస్థితి ఏమిటని అప్పుడు చాలా మంది ఉద్యోగులు బాధపడుతున్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ సీఈఓ (CEO), ఉద్యోగం కోల్పోవడం వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఉద్యోగం పోయాక ఈఎంఐలు (EMIs), పిల్లల పెంపకం ఖర్చులను ఎలా భరించాలనే ఆందోళనలో ఉన్న తన స్నేహితుడి ఉదాహరణను ఆయన ప్రస్తావించారు.

ఎన్‌గ్రో వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన దేబ్‌జిత్ సేన్, ఉద్యోగాల తొలగింపులు, అవి జీతంపై ఆధారపడే ఉద్యోగులపై చూపే ప్రభావం గురించి ట్విట్టర్ వేదికగా స్పందించారు. టెక్ దిగ్గజం ఒరాకిల్ మరో విడత ఉద్యోగాల తొలగింపును ప్రకటించిన కొద్దిసేపటికే సేన్ ఈ పోస్ట్ చేశారు. అనేకమంది వీక్షించిన ఈ పోస్ట్‌లో ఉద్యోగం కోల్పోవడం అనేది కేవలం ఉపాధిని పోగొట్టుకోవడం మాత్రమే కాదని, అది ఒక వ్యక్తి జీవితాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేయగలదని దేబ్‌జిత్ సేన్ వివరించారు.

Lay Off

కొత్త ఇల్లు కొనుగోలు చేసిన కొద్దికాలానికే ఉద్యోగం కోల్పోయిన తన స్నేహితుడి ఉదాహరణను ఆయన పేర్కొన్నారు. ఆ స్నేహితుడికి ఇప్పటికే ఒక బిడ్డ ఉండగా, ఇప్పుడు ఆయన భార్య రెండవ బిడ్డకు జన్మనివ్వబోతున్నారని పేర్కొన్నారు. ఉద్యోగం పోవడంతో కొత్త ఇంటి ఈఎంఐలను కట్టడం, ఇద్దరు పిల్లల పెంపకం ఖర్చులను ఎలా నిర్వహించాలనే ఆందోళనలో ఆ స్నేహితుడు పడిపోయారని వివరించారు. "నా పాత స్నేహితులలో ఒకరు ఇటీవల ఉద్యోగం కోల్పోయారు. ఆయన అప్పుడే కొత్త ఇల్లు కొన్నారు. అలాగే ఆయన భార్య రెండవ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇప్పుడు ఈఎంఐలు, ఇతర ఖర్చులను ఎలా నిర్వహించాలో ఆయనకు అర్థం కావడం లేదు" అని సేన్ తెలిపారు.

ఉద్యోగం కోల్పోవడం ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా తలకిందులు చేస్తుందో సేన్ విశ్లేషించారు. సేన్ పోస్ట్ పై నెటిజన్లు స్పందించారు. కామెంట్ సెక్షన్‌లో ఒక వ్యక్తి తాను ఎంత పొదుపుగా జీవించడం మొదలు పెట్టాడో వివరిచాడు. "ఒరాకిల్‌లో చాలా ఏళ్లు పనిచేసిన తర్వాత నేను కొన్ని పాఠాలు నేర్చుకున్నాను. ఇల్లు కొనకూడదు, అవసరమైతే చిన్న కారు మాత్రమే కొనాలి. పిల్లలు వద్దు, విహారయాత్రలు వద్దు, విలాసవంతమైన వస్తువులు కొనకూడదు, సాధారణ ఫోన్ ఉంటే చాలు" అని కామెంట్ చేశాడు. సేన్ ఈ జీవనశైలితో ఏకీభవించారు. అలాగే అనవసరమైన విషయాలపై డబ్బు ఖర్చు చేసినందుకు తాను చింతిస్తున్నట్లు పేర్కొన్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+