IT Stocks: ఐటీ స్టాక్స్ నిండా ముంచాయి.. టీసీఎస్, ఇన్ఫోసిస్‌లో పెట్టుబడి పెట్టి రూ.52 లక్షల నష్టం..
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు చాలా రిస్క్ తో కూడుకున్నవి. ఎప్పుడు ఏం జరుగుతోందో ఎవరు అంచనా వేయలేరు. ఈ రోజు భారీగా పెరిగిన స్టాక్ రేపు పాతాళానికి పడిపోతాయి. ఇప్పుడు సేఫ్ అన్న స్టాక్సే రిస్క్ లో పడేస్తాయి. భారత ఐటీ పరిశ్రమ ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది. ఐటీ కంపెనీలు పెట్టుబడిదారులకు భారీ లాభాలను అందించాయి. అందుకే ఐటీ స్టాక్స్ సురక్షితమని చాలా మంది అందులో పెట్టుబడి పెట్టారు. లార్జ్ క్యాప్ ఐటీ స్టాక్స్ ఇంకా పదిలమని భారీగా పెట్టుబడి పెట్టారు. సంవత్సర క్రితం వరకు పరిస్థితి అంత బాగానే ఉండేది. కానీ ఏఐ విప్లవంతో భారత ఐటీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడింది.
దీంతో భారత ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్ సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, విప్రో కంపెనీల షేర్లు పడుతూ వస్తున్నాయి. ఏఐ గురించి అప్డేట్ వచ్చినప్పుడల్లా ఐటీ స్టాక్స్ భారీగా పడిపోతున్నాయి. దీంతో ఇందులో పెట్టుబడి పెట్టిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ వ్యక్తి టీసీఎస్, ఇన్ఫోసిస్ లో భారీగా పెట్టుబడి పెట్టి ఇప్పుడు లాబోదిబోమంటున్నాడు. పడిపోతున్న షేర్లలో మళ్లీ మళ్లీ డబ్బు పెట్టడం.. చివరకు కోట్ల రూపాయల పోర్ట్‌ఫోలియోను లక్షల నష్టాల్లోకి నెట్టింది. ఇప్పుడు ఒక ఇన్వెస్టర్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఆకర్షిస్తోంది.

ఎక్స్ లో @SystemTraderIN అనే యూజర్ తన అనుభవాన్ని పంచుకున్నారు. టీసీఎస్ , ఇన్ఫోసిస్ షేర్లలో పెట్టుబడి పెట్టి రూ.57 లక్షలు నష్టపోయానని ఆయన పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా పోస్ట్ చేశాడు. కొద్ది రోజుల క్రితం తన పోర్ట్‌ఫోలియో విలువ రూ.కోటి 72లక్షలు ఉండేదని.. కానీ కొద్ది నెలల్లోనే అది రూ.కోటి15లక్షలకు పడిపోయిందని వివరించాడు. మార్కెట్ పడిపోతున్నా తాను తెలివిగా బాటమ్ పట్టుకుంటానని భావించి.. మళ్లీ మళ్లీ అదే షేర్లను కొనుగోలు చేసినట్లు వివరించాడు. స్టాప్‌లాస్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేశానని చెప్పుకొచ్చాడు.
మార్కెట్ కంటే తానే తెలివైనవాడిని అనుకున్నానని... కానీ నా అతివిశ్వాసమే తనను ఈ పరిస్థితికి తీసుకొచ్చిందని వాపోయాడు. ఇప్పుడు నిద్ర పట్టడం లేదు.. తినాలనిపించడం లేదుని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నా లైఫ్ సేవింగ్స్ కళ్ల ముందే కరిగిపోయాయని తెలిపాడు. అతని పోస్ట్ పై పలువురు స్పందించారు. ప్రస్తుతం ఐటీ రంగం ఒత్తిడిని ఎదుర్కొంటోందని, దీర్ఘకాలంలో టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి బలమైన కంపెనీలు కోలుకునే అవకాశం ఉందని కొంతమంది ఆశాభావం వ్యక్తం చేశారు. రోజూ పోర్ట్‌ఫోలియో చూస్తూ ఆందోళన చెందడం కంటే.. కొంతకాలం సహనంతో ఉండడం బెటరని చెబుతున్నారు. ఏది ఏమైనా ఐటీ స్టాక్స్ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications