Stock Market: స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి రూ.35 లక్షలు నష్టపోయిన వ్యక్తి.. చివరికి రూ.65 లక్షల అప్పులు
స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టి కోట్ల రూపాయలు సంపాదించవచ్చని చాలా మంది అనుకుంటారు. కానీ అది అందరికీ సాధ్యం కాదు. చాలా మంది స్టాక్ మార్కెట్ పెట్టుబడి పెట్టి తక్కువ కాలంలోనే కోటీశ్వరులు కావాలనుకుంటారు. ముఖ్యంగా ఇంట్రా డే ట్రేడిండ్, ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్ (F&O) ట్రేడింగ్ చేస్తారు. ఇలా చేసి రూ.లక్షలు నష్టపోయిన వారు చాల మందే ఉన్నారు. కొంత మంది అప్పులు చేసి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి నష్టపోయి ప్రాణాలు కూడా తీసుకున్నారు. తాజాగా ఓ వ్యక్తి అప్పు చేసి స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టి ఏకంగా రూ.69 లక్షలు నష్టపోయాడు. ఇందుకు సంబంధించి ఆ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి 2021లో దాదాపు రూ.35 లక్షలు అప్పుగా తీసుకుని స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశాడు. అయితే మార్కెట్ పడిపోవడంతో భారీగా నష్టాలు వచ్చాయి. ఆ తర్వాత అతను ఉద్యోగం కూడా కోల్పోయాడు. దీంతో తీసుకున్న అప్పులు సకాలంలో చెల్లించలేక పోయాడు. ఫలితంగా అప్పులపై వడ్డీలు, జరిమానాలు, ఇతర ఛార్జీలు పడి ఐదేళ్ల కాలంలో కట్టాల్సిన అప్పు ఏకంగా రూ.69 లక్షలకు పెరిగింది. అతన వద్ద ఉన్న పీఎఫ్ డబ్బులు కూడా పూర్తి డ్రా చేసి వాడేశాడు. అతని వద్ద ఎలాంటి ఆస్తులు, సేవింగ్స్ కూడా లేపు. అప్పులు ఇచ్చినవారు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని అతను రెడిట్ లో రాసుకొచ్చాడు.

తాను చేసిన తప్పు తన కుటుంబం పాలిట శాపంగా మారిందన్నాడు. అతడి పోస్ట్ నెటిజన్లు స్పందించారు. స్థానిక కోర్టుల్లోని లీగల్ ఎయిడ్ సెల్ ను ఆశ్రయించాలని సలహా ఇచ్చారు. వ్యక్తిగత దివాలా ప్రక్రియను, చట్టపరమైన మార్గాలను అన్వేషించాలని పేర్కొన్నారు. సమస్య వచ్చినప్పుడు పారిపోకుండా, చట్టపరమైన హక్కులను తెలుసుకుని ఎదుర్కొవడమే ఏకైక పరిష్కారమని సూచించారు. మరికొంత మంది నెటిజన్లు.. అత్యాశకు పోయి అప్పుల పాలు అయ్యావని ఎద్దేవా చేస్తున్నారు. అప్పు చేసి స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడం ఏంటీ బ్రో కామెంట్ చేస్తున్నారు. అయితే స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి ఎప్పుడైనా రిస్క్ అని నిపుణులు చెబుతున్నారు.
డబ్బు ఉంటే పెట్టుబడి పెట్టొచ్చు. కానీ అప్పులు చేసి మరి స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడం చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే.. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం మంచిదని సూచిస్తున్నారు. ఫండ్లలో కూడా రిస్క్ ఉంటుందని గమనించాలని గుర్తు చేస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications