Hyderabad: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే.. ఇబ్బంది పడుతున్న వాహనదారులు..

హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్ నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పటికే పనులు ప్రారంభం అయ్యాయి. ఈ పనుల నేపథ్యంలో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ఏర్పాటు చేశారు. పోలీసులు గత కొద్ది రోజులుగా ఈ వన్ వే గురించి ప్రజలు తెలియజేస్తూనే ఉన్నారు. ఆగస్ట్ 18 తేదీ నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే మార్గం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ రోజు నుంచి వన్ వే ఏర్పాటు చేశారు. దీంతో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వన్ వే సరైన అవగాహన లేక కష్టాలు పడ్డారు. 10 నిమిషాల్లో చేరుకోవాల్సిన చోటుకి గంట పడుతుందని వాహనదారులు చెబుతున్నారు.

వన్ మే మార్గం అర్థంకాక వాహనదారులు తిరిగిన చోటే మళ్లీ మళ్లీ తిరుగుతూ అయోమయానికి గురయ్యారు. అధికారుల సరైన మార్గదర్శకత్వం లేకపోవడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే వన్ వే గురించి తమకు తెలియదని చాలా మంది చెబుతున్నారు. పెద్దమ్మ గుడికి పది నిమిషాల్లో వెళ్లేవాళ్లం ఇప్పుడు గంట అయినప్పటికీ వెళ్లలేకపోయమని చెబుతున్నారు. ఈ వన్ వే వల్ల ట్రాఫిక్ మరింత పెరిగి విపరీతంగా ఇబ్బంది అవుతూందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు మీద పోలీసులేమో ఫోన్లు చూసుకుంటూ ఉంటున్నారు తప్ప ట్రాఫిక్ క్లియర్ చేయడం విమర్శిస్తున్నారు.

One Way

సగం పెట్రోల్ కేబీఆర్ పార్క్ చుట్టూ తిరిగేసరికే అయిపోయిందని ఒకరు చెప్పారు. కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టిన 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్‌ల నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకే వన్‌వే ట్రాఫిక్‌ అమలు చేస్తున్నట్టు హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. ఎస్‌ఆర్‌డీపీ పనులు, వన్‌వే ఆంక్షల అమలును ఆయన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో కలిసి స్వయంగా పర్యవేక్షించారు. ఇప్పటికే 15 పిల్లర్ల పనులు జరుగుతున్నాయని, వన్‌వే అమలుతో ఏక కాలంలో మరో 40 పిల్లర్ల ఫౌండేషన్‌ వేసేందుకు ఆటంకాలు తొలిగిపోయాయని అన్నారు. కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ఉదయం 6 గంటల నుంచి వన్‌ వే అమలు చేయగా.. పీక్‌ అవర్స్‌లో రెండు, మూడు చోట్ల మినహా మిగతా అన్ని చోట్లా ట్రాఫిక్‌ సాఫీగానే వెళ్తుందని పేర్కొన్నారు ట్రాఫిక్‌ నియంత్రణ కోసం జాయింట్‌ సీపీ, డీసీపీల పర్యవేక్షణలో.. నాలుగు షిఫ్ట్‌ల్లో వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని వెల్లడించారు.

ఈ రోజు నుంచి ఏడాదిన్నరపాటు కేబీఆర్ పార్క్ మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు సహకరించాలని కోరారు. పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, రోడ్ నెం.45 మీదుగా ఐటీ కారిడార్‌కు వెళ్లే వాహనదారులు.. కేబీఆర్ పార్క్ జంక్షన్ నుంచి బసవతారకం, ఫిల్మ్ నగర్ మీదుగా రోడ్ నెం.45 చేరుకొని అక్కడి నుంచి ఐటీ కారిడార్‌కు చేరుకోవచ్చని తెలిపారు. అయితే వాహనాదారులు మాత్రం రూట్ అర్థం చేసుకోకుండా వెళ్తున్నారు. దీంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ అయింది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+