BSNL-VI: బీఎస్ఎన్ఎల్, వోడాఫోన్ ఐడియా కస్టమర్లకు గుడ్ న్యూస్..!

ఒకప్పుడు ఇండియాలో టెలికామ్ కంపెనీల్లో బీఎస్ఎన్ఎల్ అగ్రస్థానంలో ఉండేది. అప్పుడు ఫోన్ ఇన్నవారి వద్ద బీఎస్ఎన్ఎల్ సిమ్ వాడే వారు. కానీ ప్రైవేట్ సంస్థల ఎంట్రీతో బీఎస్ఎన్ఎల్ తన ప్రభావాన్ని కోల్పోతూ వచ్చింది. ఇప్పుడు భారతదేశంలో జియో, ఎయిటెల్ మధ్య ప్రధాన పోటీ ఉంది. ఈ రెండు నెట్ వర్క్ కంపెనీలు 5జీ సర్వీసులు అందిస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ 3జీ, 4జీ వద్ద ఆగిపోయింది. మరో పక్క అప్పుల ఊబీలో కూరుకుపోయిన వోడాఫోన్ ఐడియా కూడా నిలదొక్కుకోవడానికి నానా కష్టాలు పడుతోంది. జియో, ఎయిర్ టెల్ తో పోటీ పడలేక చతికిలపడుతున్నాయి. ఈ మధ్య కాలంలో బీఎస్ఎన్ ఎల్ పుంజుకునే ప్రయత్నం చేస్తోంది.

త్వరలోనే 5జీని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. అయితే బీఎస్ఎన్ఎల్ ఉన్న ప్రధాన సమస్య సిగ్నల్ లేకపోవడం. చాలా ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ సిగ్నల్ రావడం లేదు. అందుకే చాలా మంది ఈ సిమ్ తీసుకోవడానికి వెనకడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కీలక ప్రకటన వెలువడింది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్, ప్రైవేట్ దిగ్గజం వోడాఫోన్ ఐడియా చేతులు కలపనున్నాయి. ఈ రెండు కంపెనీల మధ్య జరిగిన కీలకమైన 'నెట్‌వర్క్ షేరింగ్ ఒప్పందం' (ICR - Intra Circle Roaming) వల్ల నెట్‌వర్క్ కవరేజ్ మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంది. ఈ భాగస్వామ్యంతో యూజర్లకు మెరుగైన కవరేజ్ లభించడమే కాకుండా BSNL 5G సేవల రాకకు దారి సుగమం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

BSNL-Vodafone

ఈ ఒప్పందంలో BSNL, Vi పరస్పరం తమ టవర్లను, నెట్‌వర్క్ మౌలిక వసతులను పంచుకోనున్నాయి. దీనివల్ల వోడాఫోన్ టవర్లు ఉన్నచోట బీఎస్ఎన్ఎల్ సిగ్నల్, బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ బలంగా ఉన్న ప్రాంతాల్లో వోడాఫోన్ యూజర్లకు మెరుగైన సిగ్నల్ లభించనున్నాయి. గ్రామీణ ప్రాంతాలు, సరిహద్దు పరిసరాల్లో బిఎస్ఎన్ఎల్ కవరేజ్ బలంగా ఉంటుంది. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో వోడాఫోన్ మౌలిక వసతులు మెరుగ్గా ఉన్నాయి. ఈ ఒప్పందంతో రెండు కంపెనీల వినియోగదారులకు నెట్‌వర్క్ లోపాలు లేకుండా సేవలు అందనున్నాయి. ముఖ్యంగా రీఛార్జ్ ధరలు పెరిగిన తర్వాత BSNL వైపు మొగ్గు చూపిన వినియోగదారులకు ఇండోర్ కవరేజ్, డేటా స్పీడ్ పరంగా ఎదురవుతున్న సమస్యలకు ఈ నిర్ణయం పెద్ద ఊరట ఇచ్చే అవకాశం ఉంది.

ఈ నెట్‌వర్క్ షేరింగ్ డీల్ ఒప్పందం వల్ల బీఎస్ఎన్ఎల్ 5G వేగవంతం కానుంది. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా తన 4G నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తూన్న సంగతి తెలిసిందే. ఈ 4G టవర్లను త్వరలోనే 5G కి అప్‌గ్రేడ్ చేసే విధంగా స్వదేశీ సాంకేతికతతో సిద్ధమవుతున్నవారు. కాగా వోడాఫోన్ ఐడియా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో 5G ట్రయల్స్, విస్తరణపై దృష్టి పెట్టడంతో ఈ భాగస్వామ్యం ద్వారా BSNL కూడా తన యూజర్లకు త్వరలోనే 5G అనుభవాన్ని అందించే అవకాశం ఉంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+