SSY: సుకన్య సమృద్ధి యోజన ఖాతా ఉన్నవారికి అలెర్ట్..!
ఆడ పిల్లలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా కేంద్రం సుకన్య సమృద్ధి యోజన(SSY) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది కేవలం బాలికల కోసం తీసుకొచ్చారు. ఈ పథకంలో బాలికకు ఏదైనా గుర్తింపు కార్డు వచ్చిన తర్వాత పెట్టుబడి ప్రారంభించవచ్చు. సుకన్య సమృద్ధి యోజన ఖాతాను పోస్టాఫీస్ లో తెరవొచ్చు. ఇందులో 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలి.
యువతికి 21 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ సొమ్మ వస్తుంది. అయితే బాలికకు 18 ఏళ్లు నిండిన తర్వాత 50 శాతం వరకు డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు. ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన పథకంలో 8.2 శాతం వడ్డీ రేటును అందిస్తున్నారు. ఈ వడ్డీ రేటు మారుతూ ఉంటుంది. కాగా పథకంలో సంవత్సరంలో కనీసం రూ.250 పెట్టుబడి పెట్టాలి. గరిష్ఠంగా రూ.1.50 లక్షలు పొదుపు చేయవచ్చు. ఈ రూ. లక్ష 50 వేలకు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంటుంది.

ఎలా పొదుపు చేయాలి
సుకన్య సమృద్ధి యోజనలో నెలనెలా పెట్టుబడి పెట్టొచ్చు. లేదా రెండు నెలలకు ఒకసారి. లేదా మూడు నెలలకు ఒకసారి ఇలా ఎప్పుడైనా డబ్బు పొదుపు చేయవచ్చు. సంవత్సరంలో రూ.1.50 లక్షల వరకు మాత్రమే పెట్టుబడి పెట్టాలి. ఉదాహణకు మీరు నెలకు రూ.12,500 పెట్టుబడి పెడితే.. సంవత్సరానికి రూ.1.50 లక్షలు పెట్టుబడి పెడతారు. 15 సంవత్సరాల్లో రూ.22,50,00 పెట్టుబడి పెడతారు. దీనికి రూ. 46,77,578 వడ్డీ వస్తుంది. మొత్తం రూ.69,27,578 వస్తాయి.
ఖాతా బ్లాక్ అవుతుందా
సుకన్య సమృద్ధి యోజన పథకంలో సంవత్సరంలో కనీసం రూ.250 అయితే కచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది. లేకుంటే ఖాతా ఇన్ యాక్టివ్ అవుతుంది. సుకన్య సమృద్ధి యోజనలో ఆర్థిక సంవత్సరాన్ని సంవత్సరంగా పరిగణిస్తారు. అంటే ఏప్రిల్ టూ మార్చి వరకు ఉంటుంది. ఈ పథకంలో ఇప్పటి వరకు ఒక్క రూపాయి కట్టకుంటే మార్చి 31 లోగా కనీసం రూ.250 చెల్లించాలి లేకుంటే మార్చి 31 తర్వాత మీ ఖాతా ఇన్ యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications