సాధారణ వ్యక్తి బ్యాంకు ఖాతాలో రూ.68 కోట్లు.. డ్రా చేసుకోవడానికి బ్యాంకుకు వెళ్తే ఏం జరిగిందంటే..!
ఓ వ్యక్తి యూపీఐ యాప్ ఓపెన్ చేశాడు. తన బ్యాంకు ఖాతాలో డబ్బు ఎంత ఉందని చెక్ చేసుకోవాలని అనుకున్నాడు. యూపీఐ పిన్ నంబర్ ఎంటర్ చేసి బ్యాలెన్స్ చెక్ చేసుకున్నారు. తన ఖాతాలో డబ్బును చూసి ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. ఎప్పుడు రూ.1000, రూ.2000 లు ఉండే బ్యాంక్ ఖాతాలో ఏకంగా రూ.68 కోట్లు కనిపించాయి. దీంతో ఆ వ్యక్తి షాక్ కు గురయ్యాడు. ఇంత డబ్బు ఎలా వచ్చిందో అతనికి అర్థం కాలేదు. ఎలా వస్తే ఏంటీ.. ఆ డబ్బుతో తన కష్టాలాన్ని తీరుపోతాయని భావించాడు. వెంటనే బ్యాంకుకు వెళ్లాడు. విత్ డ్రా స్లిప్ తీసుకుని ఫిల్ చేశాడు. క్యాషియర్ దగ్గరుకు వెళ్లి క్యాష్ ఇవ్వాలని కోరాడు. అయితే అతని అకౌంట్ నంబర్ చూసిన క్యాషియర్ మీ ఖాతా ఫ్రీజ్ లో ఉందని.. డబ్బు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పాడు.
దీంతో సదర్ వ్యక్తి బ్యాంకు మేనేజర్ వద్దకు వెళ్లాడు. తన బ్యాంక్ ఖాతా ఎందుకు ఫ్రీజ్ చేశారు. తనకు డబ్బులు ఎందుకు ఇవ్వడలేదని ప్రశ్నించాడు. ఇంత భారీ మొత్తం మీ బ్యాంకు ఖాతాలో ఎలా వచ్చిందో విచారణ జరుగుతుందని బ్యాంక్ మేనేజర్ చెప్పాడు. అప్పటి వరకు మీ ఖాతా ఫ్రీజ్ లోనే ఉంటుందని ఆ వ్యక్తికి తేల్చి చెప్పాడు. మీరు ఏమైనా చేసి ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. దీంతో సదరు వ్యక్తి ఆందోళనకు గురయ్యాడు. తన పరిస్థితిను సోషల్ మీడియాలో వివరించారు. తను తన బ్యాంకు ఖాతాలో డబ్బు ఎంత ఉందో చెక్ చేసుకున్నానని.. ఖాతా బ్యాలెన్స్ చూసి ఆశ్చర్యపోయినట్లు వివరించాడు. ఆ డబ్బుతో తన కష్టాలు తీరుతాయని అనుకున్నట్లు చెప్పారు.

తను ఆ డబ్బును తీయడానికి వెళ్లినప్పుడు తన ఖాతా ఫ్రీజ్ అయిందని బ్యాంక్ తెలిపిందని ఎక్స్ లో పోస్ట్ చేశాడు. బ్యాంకు సిబ్బంది సమాధానంతో ఒక్కసారిగా నిరాశకు గురైనట్లు చెప్పారు. ఇలా ఎందుకు చేశారని అడిగానని పేర్కొన్నారు.అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఖాతాలోకి ఎక్కడి నుంచి వచ్చాయోనని తెలుసుకునేందుకు విచారణ జరుగుతోందని బ్యాంకు మేనేజర్ చెప్పాడని వివరించారు. ఆ మాట వినగానే నా సంతోషం ఆవిరైపోయిందని, పైగా ఆందోళన మొదలైందని వాపోయాడు. అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. ఏ బ్యాంకు కూడా తెలియలేదు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి.
బెంగాల్‌లోని సౌత్ 24 పరగణాల జిల్లాలో కాశ్మీరా షేక్ అనే మహిళ తన గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు ఖాతాలో పడ్డాయో లేదో తెలుసుకోవడానికి కుల్తాలీ జమ్‌తలా ప్రాంతంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లారు. అక్కడి బ్యాంక్ సిబ్బంది పాస్‌బుక్ పరిశీలించి, ఆమె ఖాతాలో రూ. 99,99,99,997 ఉన్నట్లు చెప్పారు. దీంతో ఆమె ఆశ్చర్యపోయింది. దీనిపై కూడా విచారణ కొనసాగుతోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications