PNB: పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ మోసం.. ఖాతాదారుల డబ్బును కొట్టేసిన సిబ్బంది..!
బ్యాంకులో డబ్బులు ఉంటే భద్రంగా ఉంటాయనుకుంటాం. కానీ బ్యాంకుల్లో డబ్బులకు కూడా భద్రత ఉండడం లేదు. తాజాగా దేశీయ బ్యాంకింగ్ రంగంలో మరో భారీ మోసం సంచలనం సృష్టిస్తోంది. ఈ కుంభకోణం పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో వెలుగులోకి వచ్చింది. గ్రేటర్ నోయిడాలోని ఓ పీఎన్బీ శాఖలోని ఖాతాల్లోని రూ.35 కోట్ల వరకు డబ్బు మాయమైనట్లు ఆరోపణలు వచ్చాయి. సేవింగ్స్ అకౌంట్లు, ఫిక్సెడ్ డిపాజిట్ల నుంచి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే డబ్బులు ఖాళీ కావడంతో అకౌంట్ హోల్డర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలోని సెక్టర్ పై-1లో ఉన్న పీఎన్బీ బ్రాంచ్‌లో ఈ భారీ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఖాతాదారుల ప్రమేయం లేకుండానే వారి అకౌంట్ల నుంచి డబ్బు ట్రాన్స్ఫర్ కావడం, ఎఫ్డీలను ప్రీ-మెచ్యూర్ క్లోజ్ చేయడం స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. తమ కష్టార్జితం ఒక్కసారిగా ఆవిరైపోవడంతో ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖాతాదారుల ఖాతాల నుంచి భారీగా డబ్బులు డ్రా అవుతున్నా, ఎవరికీ ఎలాంటి ఎస్ఎంఎస్ కూడా రాలేదని తెలుస్తోంది. విజేంద్ర సింగ్ అనే వ్యక్తి సేవింగ్స్ అకౌంట్ బ్యాలెన్స్ రూ.88 లక్షల నుంచి రూ.లక్షకు తగ్గింది. అతను యూపీఐ యాప్ లో బ్యాలెన్స్ తగ్గడంతో వెంటనే బ్యాంకుకు పరుగెత్తాడు. హనీఫ్ ఖాన్ అనే మరో ఖాతాదారుడి ఖాతాలో రూ. 39 లక్షలు పూర్తిగా డెబిట్ అయ్యాయి.

బ్యాలెన్స్ చెక్ చేసుకునే వరకు అతనికి డబ్బులు కట్ అయినట్లు తెలియదు. అతను తనకు ఎలాంటి మెసేజ్ రాలేదని చెప్పాడు. అంతేకాకుండా ఎక్కడా సంతకాలు కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. మరో ఖాతాదారుడి ఖాతాలో ఉన్న రూ.9 లక్షలు కూడా డెబిట్ అయ్యాయి. విషయం తెలుసుకున్న అతను వెంటనే బ్యాంకుకు పరుగెత్తాడు. అయితే ఖాతాదారులు తమ పాస్ బుక్ అప్డేట్ చేయమని వచ్చినప్పుడల్లా.. ఆర్బీఐ ఆడిట్ జరుగుతోందని చెప్పి బ్యాంకు సిబ్బంది వెనక్కు పంపించేవారని ఖాతాదారులు చెబుతున్నారు. ఈ బ్యాంక్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారడంతో పంజాబ్ నేషనల్ బ్యాంకు చర్యలు చేపట్టింది.
గ్రేటర్ నోయిడాలోని ఆ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్‌తో సహా మొత్తం 5 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది. ఆ బ్రాంచ్ సిబ్బందిని పూర్తిగా మార్చేసినట్లు వివరించింది. డబ్బులు పోగొట్టుకున్న బాధితుల ఫిర్యాదు మేరకు బీటా-2 పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు 18 మంది బాధితులు ఫిర్యాదుచేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు తీవ్రతను బట్టి దర్యాప్తును ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేసే అవకాశం ఉందిని తెలుస్తోంది. పీఎన్బీ యాంటీ కరప్షన్ టీమ్ కూడా దీనిపై అంతర్గత విచారణ జరుపుతున్నట్లు సమాచారం.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications