Nirav Modi: నీరవ్ మోదీకి షాక్.. బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.100 కోట్లు చెల్లించాలని ఆదేశం..

బ్యాంకులకు వేల కోట్ల రూపాయల కుచ్చుటోపి పెట్టిన నీరవ్ మోదీకి షాక్ తగిలింది. లండన్ కోర్టు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 10.7 మిలియన్లు (రూ. 100 కోట్లకు పైగా) చెల్లించాలని నీరవ్ ను ఆదేశించింది. నీరవ్ మోదీకి చెందిన దుబాయ్ లోని డైమండ్ ఎఫ్ జెడ్ఈ అనే కంపెనీ నీరవ్ పూచీకత్తుతో 2012లో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రుణం తీసుకుంది. అయితే ఈఎంఐలు చెల్లించడంలో కంపెనీ విఫలమైంది. దీంతో హామీదారుగా ఉన్న నీరువ్ మోదీని బ్యాంక్ సంప్రదించింది. అయితే రుణం చెల్లింపు సాధ్యం కాదని బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తనకు ఎటువంటి సరైన డిమాండ్ నోటీసులు రాలేదని లండన్ సర్క్యూట్ కమర్షియల్ కోర్టుకు వెళ్లారు. దీనిపై వాదనలు కొనసాగాయి.

కంపెనీ నీరవ్ మోదీ హామీతో రుణం తీసుకుందని.. ఒకవేళ కంపెనీ రుణం చెల్లించకుంటే నీరవ్ చెల్లించాలని మంగళవారం కోర్టు తీర్పు ఇచ్చింది. బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెల్లించాల్సిన మొత్తం అంటే అసలు, వడ్డీ కలిపి రూ.100 కోట్లు చెల్లించాలని స్పష్టం చేసింది. బ్యాంక్‌కు ఇచ్చిన వ్యక్తిగత హామీ ప్రకారం నీరవ్ మోదీ బాధ్యత వహించాలని పేర్కొంది. నీరవ్ మోదీ 2019 మార్చి 19న అరస్టయ్యారు. ప్రస్తుతం ఆయన లండన్ జైలులో ఉన్నారు. కాగా నీరవ్ మోదీని భారత్ కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నీరవ్ మోదీని ఇండియాకు తీసుకొచ్చే విషయంలో భారత్ కట్టుబడి ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

Nirav Modi

నీరవ్ అప్పగింతపై నిరంతరం యూకే అధికారులతో మాట్లాడుతున్నామని పేర్కొంది. ఇందుకోసం న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతోందని వివరించింది. కాగా నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. జెల్జియంలోని జైలులో ఉన్న తమ మామ మెహుల్ చోక్సీతో కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.13,000 కోట్ల మోసానికి పాల్పడినట్లు నీరవ్ మోదీపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన లండన్ పారిపోయాడు. ఈ 13,000 కోట్లలో దాదాపు సగం సొమ్ము అంటే రూ.6,498.20 కోట్లు నీరవ్ పక్కదారి పట్టించారని సీబీఐ అభియోగాలు మోపింది. అయితే 2021లో నీరవ్ ను భారత్ కు అప్పగించేందుకు యూకే హో కార్యదర్శి ఒకే చెప్పారు. కానీ ఆ తర్వాత ఈ విషయాన్ని ఎవరు పట్టించుకోలేదు.

తాజాగా నీరవ్ మోదీకి లండన్ కోర్టు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడంతో ఈ విషయంపై మళ్లీ చర్చలు మొదలయ్యాయి. కాగా కొంత బడా వ్యాపారులు బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఎగవేస్తున్నారు. అయితే సామాన్య పౌరుడు రూ. 100 బాకీ ఉన్నా.. పీడించే బ్యాంకులు కొందరు వ్యాపారుల పట్ల అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి.

సీబీఐ ప్రకారం, దుర్వినియోగం చేయబడిన మొత్తం సొమ్ములో ₹6,498.20 కోట్లను నీరవ్ మోడీ ఒక్కరే పక్కదారి పట్టించారు. 2021లో యూకే హోం సెక్రటరీ అతని అప్పగింతకు మొదట ఆదేశించినప్పటికీ, అప్పటి నుండి ఆ విషయం అటకెక్కింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+