Trending: సోషల్ మీడియాకు చేరిన ఫిప్‌కార్ట్ పంచాయితీ.. చిన్న పిల్ల చేత అలా..
Flipkart News: దేశంలోని అతిపెద్ద ఈకామర్స్ దిగ్గజాల్లో ఒకటిగా ఫిప్‌కార్ట్ కొనసాగుతోంది. అయితే దీనిలో పనిచేస్తున్న ఉద్యోగుల తీరు ఇబ్బందికరంగా ఉండటంతో అది సోషల్ మీడియాకు వచ్చింది. ప్రస్తుతం ఇది వైరల్ గా మారుతోంది.
ఈకామర్స్ దిగ్గజం సేఫ్ డెలివరీలో భాగంగా డెలివరీ సమయంలో వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP)ని తప్పనిసరి చేసింది. ఈ క్రమంలో ఒక వ్యక్తి డెలివరీ సమయంలో ఓటీపీ గురించి అవగాహన లేకపోవటంతో అతినిపై డెలివరీ ఎగ్జిక్యూటివ్ విరుకుపడ్డాడు. దీంతో తన తండ్రిపై డెలివరీ ఏజెంట్ దురుసుగా ప్రవర్తించినట్లు ఈశ్వరి అనే మహిళ విషయాన్ని సోషల్ మీడియాకు తీసుకొచ్చింది. భవిష్యత్తులో షాపింగ్ కోసం Flipkart తాను ఉపయోగించబోనంటూ ప్రతిజ్ఞ చేసింది.

ఈశ్వరి నిన్న మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో ఈ-కామర్స్ కంపెనీతో తన తండ్రి ఎదుర్కొన్న అసహ్యకరమైన అనుభవాన్ని పంచుకుంది. తన తండ్రి ఫిప్ కార్ట్ నుంచి ఒక వస్తువు ఆర్డర్ చేశారని, అయితే డెలివరీ సమయంలో తన తండ్రికి ఫోన్‌లో OTP కనిపించలేదని ఆమె చెప్పింది. దీంతో అసహనానికి గురైన సదరు డెలివరీ ఏజెంట్ సహాయం చేయటం లేదా కొన్ని నిమిషాలు వేచి చూడకుండా విరుచుకుపడ్డాడు. వినియోగించటం రానప్పుడు ఆన్ లైన్ ద్వారా వస్తువులు ఆర్డర్ చేయటం ఎందుకంటూ హేళన చేసినట్లు సదరు మహిళ వెల్లడించింది.
వృద్ధుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం ఒక వ్యక్తి చేయగలిగే నీచమైన పని. కస్టమర్ లేదా ఏ కస్టమర్ అయినా కనీసం ప్రాథమిక గౌరవాన్ని కలిగి ఉండకూడదు అంటూ ఒక యూజర్ స్పందించాడు. మరికొందరైతే ఫ్లిప్‌కార్ట్ పేలవమైన కస్టమర్ సర్వీస్ కలిగి ఉందంటూ తమ గత అనుభవాన్ని వెళ్లగక్కారు. అయితే ఇది నిజంగానే జరిగిందా అసలు ఎక్కడ జరిగిందే వివరాలు ఇందులో లేవు. పైగా కంపెనీ సైతం దీని గురించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.


Click it and Unblock the Notifications