Holiday: గుడ్ న్యూస్.. నవంబర్ 26న స్కూళ్లు, కాలేజీలు బంద్..!

నవంబర్ 26న ఏపీలోని పలు జిల్లాల్లో సెలవు ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఈ నెల 26వ తేదీన సెలవు ఇవ్వనున్నట్లు అధికారులు ప్రకటించారు. 23 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఈ సెలవు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆ రోజున ఎన్నికలు జరిగే కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో సెలవు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు స్థానిక ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు ఈ సెలవు ప్రకటిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

సెలవు ఇచ్చిన నేపథ్యంలో ప్రతీఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు కోరారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఈ సెలవు ప్రకటించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశించింది. ఎన్నికలు జరగనున్న 23 ప్రాంతాల్లో తప్పనిసరిగా నవంబర్ 26న సెలవు ఉంటుంది. కాగా ఆ రోజు ఏపీలోని 4 నగరపాలక సంస్థలు, 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. మొత్తం 23 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్, విద్యాసంస్థలకు ఈ సెలవు ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించాలని ప్రభుత్వం ఆదేశించింది.

Holiday

రాష్ట్రవ్యాప్తంగా మిగతా ప్రాంతాల్లో సెలవు ఉండదు. నవంబర్ 26న సెలవు ఉండే ప్రాంతాలు పరిశీలిస్తే.. ఇందులో మంగళగిరి-తాడేపల్లి, శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, నగరపాలక సంస్థలతో పాటు 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు నవంబర్ 26న పోలింగ్ నిర్వహించనున్నారు. అలాగే ఇదే రోజు 26 జిల్లాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగుతాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటలకు పోలింగ్ నిర్వహిస్తారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+