గుడ్ న్యూస్.. రేపు స్కూళ్లు, కాలేజీలు, బ్యాంకులు బంద్..!
బెంగళూరుతో పాటు కర్ణాటకలో నవంబర్ 27న సెలవు ప్రకటించారు. ఆ రోజు స్కూళ్లు, కాలేజీలు బంద్ కానున్నాయి. అదే విధంగా బ్యాంకులకు కూడా సెలవు ప్రకటించారు. కనకదాస జయంతి సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రభుత్వం సెలవు ప్రకటించిన నేపథ్యంలో ఐటీ కంపెనీలు కూడా సెలవు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒక వేళ ఐటీ కంపెనీలు సెలవు ఇస్తే.. ఐటి ఉద్యోగులకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. ఆర్‌బిఐ నవంబర్ 27ను 'నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం కింద సెలవు దినం'గా ప్రకటించింది. ఇది కాకుండా అన్ని షెడ్యూల్డ్, నాన్-షెడ్యూల్డ్ బ్యాంకులు రెండో, నాల్గవ శనివారాల్లో ప్రభుత్వ సెలవు దినాన్ని పాటిస్తాయి.
కనకదాస జయంతి సందర్భంగా నవంబర్ 27న కర్ణాటకలో బ్యాంకులు బంద్ అయి ఉంటాయి. నవంబర్ 28న నాల్గో శనివారం, 29న ఆదివారం. అంటే బ్యాంకులకు కూడా వరుసగా మూడు రోజులు సెలవులు వస్తాయి. పూజ్య కవి, తత్వవేత్త, సంగీతకారుడు, సంఘ సంస్కర్త అయిన శ్రీ కనకదాస జయంతిని కర్ణాటకలో ఘనంగా జరుపుకుంటారు. కర్ణాటక ప్రభుత్వం కనకదాసు జయంతిని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది. ఆ మహనీయుని స్మరించుకుంటూ ఈ రోజున పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ సంస్థలు సెలవులు ఇస్తారు. సాహిత్యం, సంస్కృతి, ఆధ్యాత్మిక సంస్కరణలకు కనకదాసు చేసిన సేవలను గుర్తించిన కర్ణాటక ప్రభుత్వం ఆ రోజును అధికారిక సెలవు దినంగా ప్రకటించింది.

ఐటీ సంస్థలకు సెలవు గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రభుత్వం సెలవు ప్రకటించిన నేపథ్యంలో కంపెనీలు కూడా శుక్రవారం సెలవు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే వచ్చే నెలల కూడా సెలవులు ఉన్నాయి. ముఖ్యంగా క్రిస్మస్ సందర్భంగా సెలవులు ఇస్తారు. డిసెంబర్ లో ఆదివారాలు 6, 13, 20, 27 తేదీల్లో వచ్చాయి. రెండో శనివారం డిసెంబర్ 12న, నాలుగో శనివారం డిసెంబర్ 26న ఉన్నాయి. ఈ తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు ఉంటాయి. డిసెంబర్ 24న క్రిస్మస్ ఈవ్ సందర్భంగా మేఘాలయ, మిజోరం, నాగాలాండ్ సెలవు ఉండగా.. డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవు ఉంటుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications