PhonePe News: ఏళ్లతరబడి కోర్టులకెక్కిన ఫోన్ పే, భారత్ పే.. ఐదేళ్ల తర్వాత కథ సుఖాంతం..
BharatPe News: దేశీయ ఫిన్‌టెక్ దిగ్గజాలు భారత్ పే మరియు ఫోన్ పే మధ్య ఏళ్ల తరబడి నడిచిన వివాదం ఎట్టకేలకు సద్దుమణింగింది. నువ్వా, నేనా అంటూ కొట్టుకున్న ఈ రెండు కంపెనీలు ఓ జాయింట్ స్టేట్‌మెంట్ ఇచ్చి ఒక్కసారిగా షాక్ ఇచ్చాయి. తమ మధ్య సమస్యలు పరిష్కారమయ్యాయని ప్రకటన విడుదల చేశాయి.
తమ సంస్థల పేరు చివరన 'పే' ట్రేడ్‌మార్క్ వినియోగానికి సంబంధించి భారత్ పే మరియు ఫోన్ పే లు ఎంతోకాలంగా న్యాయపోరాటం చేస్తున్నాయి. ఈ దీర్ఘకాల చట్టపరమైన వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకున్నట్లు ఇర సంస్థలూ కలిసి ప్రకటన విడుదల చేశాయి. గత 5 ఏళ్లుగా కోర్టు వివాదాల్లో చిక్కుకోగా.. ఇప్పుడు సెటిల్‌మెంట్ ద్వారా బహిరంగ న్యాయ విచారణకు ముగింపు పలుకుతున్నట్లు తెలిపాయి.

'ఇది పరిశ్రమకు సానుకూల పరిణామం. ఇరుపక్షాల యాజమాన్యం చూపిన పరిపక్వత మరియు వృత్తి నైపుణ్యాన్ని అభినందిస్తున్నాను. చట్టపరమైన సమస్యలన్నింటి పరిష్కరానికి సన్నిహితంగా పనిచేస్తున్నాము. తద్వారా పటిష్టమైన డిజిటల్ చెల్లింపు పర్యావరణ వ్యవస్థలను నిర్మించడంలో శక్తి మరియు వనరులను కేంద్రీకరించడానికి ముందుకు సాగుతున్నాము' అని భారత్‌పే చైర్మన్ రజనీష్ కుమార్ ప్రకటించారు.
'తమ ఇరు కంపెనీలు తీసుకున్న నిర్ణయం.. భవిష్యత్తులో మరింత ముందుకు సాగడానికి ఉపకరిస్తుంది. మొత్తంగా భారతీయ ఫిన్‌టెక్ పరిశ్రమ వృద్ధిపై దృష్టి పెట్టడానికి ప్రయోజనం చేకూరుస్తుంది' అని ఫోన్ పే వ్యవస్థాపకులు మరియు CEO సమీర్ నిగమ్ అభిప్రాయపడ్డారు. కాగా ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రీ విషయంలో పరస్పర ఆరోపణలను ఉపసంహరించుకోవడానికి ఇరు పార్టీలు ఇప్పటికే చర్యలు తీసుకున్నాయి.


Click it and Unblock the Notifications