Dubai: ఫలితం ఆశించకుండా చేసే మంచి పనులు కొన్నిసార్లు అత్యున్నత స్థానంలో ఉన్న వారి నుంచి ప్రశంసలు పొందటానికి దారితీస్తాయి. ఇలాంటి వాటికి ప్రపంచంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా దుబాయ్‌లోని ఫుడ్ డెలివరీ ఏజెంట్ చేసిన చిన్న పని.. ఆ దేశ యువరాజు ప్రశంసలకు కారణమైంది.

ఫుడ్ డెలివరీ ఏజెంట్..
పాకిస్థాన్ కి చెందిన అబ్దుల్ గఫూర్ అనే వ్యక్తి దుబాయ్‌లో ఫుడ్ డెలివరీ ఏజెంట్ గా పనిచేస్తున్నాడు. అతను ఇటీవల తన ద్విచక్ర వాహనంపై ఆహారం డెలివరీకి వెళుతున్నప్పుడు రద్దీగా ఉండే రహదారిపై ఒక ఇటుకను చూశాడు. వెంటనే తన వాహనాన్ని పక్కన పార్క్ చేసి రద్దీ రోడ్డుపై ఉన్న ఇటుకను తొలగించాడు. దీంతో ఆ రోడ్డులో జరగాల్సిన ప్రమాదాలు తప్పాయి. పైగా అది ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తోంది. అయితే అతడు చేసిన పనికి అక్కడ దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
దుబాయ్ యువరాజు..
దీనికి సంబంధించిన వీడియో వెబ్‌సైట్లలో వైరల్ కావడంతో.. దుబాయ్ ప్రిన్స్ హమ్దాన్ బిన్ మహ్మద్ అల్ మక్తూమ్ వీడియోను చూసి ఆశ్చర్యపోయారు. ప్రిన్స్ వెంటనే తన ట్విట్టర్ పేజీలో వీడియోను పంచుకున్నారు. రద్దీ రహదారిపై ఇటుకను తొలగించిన డెలివరీ ఏజెంట్‌ను చూడాలనుకుంటున్నారు.

దుబాయ్ పోలీసులు..
వెంటనే దుబాయ్ పోలీసులు డెలివరీ ఏజెంట్ మొబైల్ నంబర్‌ను కనుగొని, యువరాజు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారని అతడికి చెప్పారు. పోలీసులు చెప్పిన మాటలకు అతను ఆశ్చర్యపోయాడు. అతను ప్రస్తుతం విదేశాల్లో ఉన్నానని, తాను దుబాయ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రిన్స్ను కలుస్తానని చెప్పాడు.

యువరాజుతో సమావేశం..
దుబాయ్ వచ్చినప్పుడు అబ్దుల్ గఫూర్ దుబాయ్ యువరాజును కలిశాడు. యువరాజు అతనికి తన కృతజ్ఞతలతో పాటు ప్రశంసలను తెలియజేశారు. "దుబాయ్ యువరాజు అతనికి కృతజ్ఞతలు చెప్పినప్పుడు నేను నా కళ్లు, చెవులను నమ్మలేకపోయాను" అని అబ్దుల్ గఫూర్ చెప్పాడు.

బహుమతి..
అబ్దుల్ గఫూర్ చేసిన చిన్న పనికి పెద్ద పారితోషికం వస్తుందని ఊహించలేదు. దుబాయ్ యువరాజును కలిసిన అతడు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. దుబాయ్ యువరాజు.. అబ్దుల్ కఫూర్ కుటుంబం గురించి ఆరా తీశారు. ఆయనను ఎప్పుడైనా కలుస్తానని, ఏ సహాయం కావాలన్నా అడగవచ్చని అబ్దుల్ కఫూర్ చెప్పాడు. అతను చేసిన పనికి ప్రతిఫలంతో పాటు ప్రశంసలు కూడా లభించాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications