భారత్ కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా వెజ్ రైస్ లో చికెన్ ముక్కలు రావడంతో ఎయిరిండియాపై వార్తలు వైరలయ్యాయి. కాలికట్ నుంచి ముంబై వెళ్తున్న ఎయిరిండియా విమానంలో శాఖాహార భోజనాన్ని "చికెన్ ముక్కలతో" అందించారని వీర జైన్ అనే మహిళ ఫిర్యాదు చేశారు. విమానం ఆలస్యమవడంపై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వీర జైన్ కాలికట్ నుంచి ముంబై టికెట్ బుక్ చేసుకున్నారు. విమానం బయల్దేరాల్సిన సమయం సాయంత్రం 6.40 నిమిషాలు అని ఉంది. దీంతో ఆమె ముందుగానే ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. కానీ విమానం గంట ఆలస్యంగా అంటే రాత్రి 7 గంటల 40 నిషాలకు బయల్దేరింది.
విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికి ఆమెకు ఆకలి కావడంతో వెజ్ మీల్స్ ఆర్డర్ ఇచ్చింది. విమానం సిబ్బంది వెజ్ మీల్స్ ఇచ్చారు. వేడి వేడిగా ఉండడంతో తిందామని రెండు స్ఫూన్లు తిన్నది. అయితే అందులో చికెన్ ముక్క వచ్చింది. దీంతో ఆమె షాక్ అయింది. ఫుడ్ ప్యాకెట్ పై వెట్ మెయిన్ మీల్ అని రాసి ఉంది. కానీ అందులో చికెన్ ముక్క రావడంతో జైన్ సీరియస్ అయింది. ఎయిరిండియా కేబిన్ సూపర్ వైజర్ సోనానికి ఫిర్యాదు చేశారు. మొబైల్ ఫోన్ లో తీసిన ఫొటోలు కూడా చూపించారు.

"నేను ప్రతి ఒక్కరికీ సూచిస్తాను- దయచేసి మీరు విమానంలో తినేవాటిని క్షుణ్ణంగా తనిఖీ చేయండి. రెండు చాలా ఆలస్యమైన విమానాలు (జనవరి 4న మమ్-కోజికోడ్ మరియు జనవరి 8న తిరిగి రావడం), నాన్‌వెజ్ అందించిన తర్వాత, నేను ఇప్పుడు అన్ని ఎయిర్‌లైన్ ఫుడ్‌పై నమ్మకం కోల్పోయాను" అని జైన్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో పేర్కొన్నారు. ఈ విషయం గురించి క్యాబిన్ సూపర్‌వైజర్‌కు తెలియజేశానని, ఆ తర్వాత ఆమె క్షమాపణలు చెప్పిందని వివరించారు.
ఇతర ప్రయాణికుల నుంచి కూడా ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయని జైన్ తెలిపారు. అయితే, శాఖాహార భోజనం చేస్తున్న ఇతర ఫ్లైయర్‌లకు సమాచారం అందించడానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications