ASML: లే ఆఫ్స్ వేళ ఉద్యోగులకు రూ.19 లక్షల బోనస్ ప్రకటించిన కంపెనీ..!

ప్రస్తుతం టెక్ ప్రపంచాన్ని ఏఐ భయపెడుతోంది. ఏఐ రాకతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. పెద్ద పెద్ద కంపెనీలు ఏఐపై భారీగా పెట్టుబడి పెట్టి ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఓ టెక్నాలజీ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది ఓ యూరోపియన్ కంపెనీ. అతి పెద్ద టెక్నాలజీ కంపెనీల్లో ఒకటైన అధునాతన సెమీకండక్టర్ మెటీరియల్స్ లిథోగ్రఫీ తమ ఉద్యోగులకు భారీ ఆఫర్ ప్రకటించింది. ఉద్యోగులను తొలగించడం కాకుండా.. ఉద్యోగులు తమ కంపెనీలోనే ఉంటే భారీ బోనస్ ఇస్తామని ప్రకటించింది. ప్రతిభ గల ఉద్యోగులు కంపెనీ నుంచి బయటకు వెళ్లకుండా ఏఎస్ఎంఎల్ ఈ ప్రకటన చేసింది.

అర్హత గల ఉద్యోగులు 2027 నుంచి 2030 వరకు కంపెనీలోనే కొనసాగితే... వారికి రూ.19 లక్షల విలువైన షేర్లను బోనస్ గా ఇస్తామని ప్రకటించింది. ఏఎస్ఎంఎల్ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏఎస్ఎంఎల్ ప్రకటించిన ఈ ప్రత్యేక బోనస్ 2027 జనవరి 1న మంజూరు కానుంది. అయితే ఉద్యోగులు ఈ బోనస్ మొత్తాన్ని పొందాలంటే 20230 జనవరి 1 వరకు కంపెనీలో పని చేయాలి. వచ్చే మూడు సంవత్సరాలు కంపెనీలో కొనసాగిన ఉద్యోగికి రూ.19 లక్షల విలువైన షేర్లు బోనస్ గా పొందనున్నారు.

Bonus for Employees

సెమీకండక్టర్ మెటీరియల్స్ లిథోగ్రఫీ వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీల్లో ఒకటిగా ఉంది. ఈ కంపెనీ చిప్ తయారీలో కీలకమైన లిథోగ్రఫీ టెక్నాలజీ, 3D చిప్ ఆర్కిటెక్చర్, ఏఐ ఆధారిత సిస్టమ్స్ పై దృష్టి పెట్టింది. పెట్టుబడులు సత్ఫలితాలు ఇవ్వాలంటే ఉద్యోగుల పాత్ర కీలకమని ఆ కంపెనీ భావిస్తోంది. అందుకే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత సమయంలో సెమీకండక్టర్ రంగంలో నైపుణ్యం ఉన్న ఉద్యోగులకు డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులను ఇతర కంపెనీలకు వెళ్లకుండా నిలుపుకోవడానికి టెక్ సంస్థలు ప్రత్యేక బోనస్‌లు అందిస్తున్నాయి.

సెమీకండక్టర్ మెటీరియల్స్ లిథోగ్రఫీ కాకుండా మిగతా చిప్ దిగ్గజాలు కూడా ఉద్యోగులకు భారీ ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సామ్‌సంగ్ తన ఉద్యోగుల్లో చాలామందికి సుమారు రూ.3కోట్ల 51లక్షల వరకు బోనస్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే SK Hynix కూడా ఉద్యోగులకు సుమారు రూ.4కోట్ల 52 లక్షలు విలువైన బోనస్‌లు ప్రకటించినట్లు సమాచారం. ఉద్యోగులను ఆకర్షించేందుకు షేర్లు, రిటెన్షన్ బోనస్‌లు, ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+