Dinosaur skeleton: రూ.482 కోట్లు పలికిన డైనోసార్ అస్థిపంజరం..

డైనోసార్‌ ను ఎవరైనా ప్రత్యక్షంగా చూశారా అంటే.. చూడలేదని చెబుతారు. ఎందుకంటే.. వేల సంవత్సరాల క్రితమే డైనోసార్ జాతి జాతి అంతరించిపోయింది. జాతి అంతరించిపోయినా దాని గురించి చర్చ కొనసాగుతూనే ఉంటుంది. తాజాగా 6.7 కోట్ల సంవత్సరాల నాటి టి-రెక్స్ డైనోసార్ అస్థిపంజరానికి భారీ ధర పలికింది. వేలంలో 50.1 మిలియన్ డాలర్ల అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.482 కోట్లు పలికింది. అమెరికాకు చెందిన సుప్రసిద్ధ వేలం సంస్థ సదబీస్ ఈ వేలం నిర్వహించింది. ఇది రికార్డు ధర అని నిర్వాహకులు చెబుతున్నారు.

మొదటగా ఈ డైనోసార్ అస్థిపంజరానికి 30 మిలియన్ డాలర్లు భారత కరెన్సీ ప్రకారం రూ.288 కోట్లు వరకు వస్తాయని భావించారు. అయితే ప్రపంచం నలుమూలల నుంచి చాలా మంది కోటీశ్వరులు ఈ వేలంలో పాల్గొన్నారు. వేలం స్టార్ట్ అయిన కేవలం 10 నిమిషాల్లోనే ఓ కోటీశ్వరుడు 50.1 మిలియన్ డాలర్ల చెల్లించి డైనోసార్ అస్తిపంజరాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ డైనోసార్ అస్థిపంజరం చాలా ప్రత్యేకమైంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మాంసాహార డైనోసార్ అయిన టి-రెక్స్ అస్థిపంజరమని చెబుతున్నారు.

Dinosaur skeleton

ఈ అస్థిపంజరాన్ని అమెరికాలోని సౌత్ డకోటా ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేట్ వ్యవసాయ క్షేత్రం నుంచి బయటకు తీశారు.ి ఈ అస్థిపంజరంలో దాదాపు 183 అసలైన ఎముకలు చెక్కుచెదరకుండా ఇప్పిటికీ ఇలాగే ఉన్నాయని వేలం నిర్వాహకులు తెలిపారు. 61 శాతం ఎముకలు అలాగే ఉన్నాయని. మిగిలిన భాగాలను కృత్రిమ ఎముకలతో భర్తీ చేసినట్లు వివరించారు. డైనోసార్ తన వేట కోసం పరుగులు పెడుతున్నట్లు చూపించారు. డైనోసార్ అస్థిపంజరాన్ని వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసినప్పటికీ విజ్ఞాన శాస్త్ర రంగానికి ఇది పెద్ద దెబ్బ అని చెబుతున్నారు.

పూర్వకాలంలో ఇలాంటి అస్థిపంజరాలు లభిస్తే వాటిని ప్రజల సందర్శన కోసం, పరిశోధనల కోసం ప్రభుత్వ మ్యూజియాల్లో ఉంచేవారని గుర్తు చేస్తున్నారు. వీటిని కొనుగోలు చేసేవారు.. డ్రాయింగ్ రూమ్‌లలో అలంకరణగా ఉంచుకుంటారని పేర్కొంటున్నారు. దీన్ని పరిశోధనల కోసం ఉపయోగిస్తే.. చాలా విషయాలు తెలిసే అవకాశం ఉండేదని అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్ ఇలాంటి లభించినప్పుడు పరిశోధనల కోసం ఉపయోగించాలని కోరుతున్నారు. వేలం వేస్తే ఉపయోగం ఏమి ఉండదని చెబుతున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+