Tirumala: తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారం సమర్పించిన భక్తుడు..!
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు భారీగా బంగారం కానుకలు సమర్పించారు. తిరుమల చరిత్రలో తొలిసారిగా భారీగా బంగారు ఆభరణాలు స్వామివారికి సమర్పించారు. శ్రీ వెంకటేశ్వర స్వామికి 121 కిలోల బంగారం కానుకగా టీటీడీకి అందిస్తున్నారు. కాగా ఈ 121 కిలోల బంగారం విలువ దాదాపు రూ.160 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో బంగారు ఆభరణాలను టీటీడీకి అప్పగించనున్నారు. ఈ 121 కిలలో బంగారంలో స్వామివారికి కిరీటం, సాలగ్రామ హారాలు, పాదుకాలతో పాటు మొత్తం 46 రకాల ఆభరణాలు ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా దాతలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే తిరుమల చేరుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోనున్న సీఎం చంద్రబాబు.. ఆ తర్వాత.. శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాల సమర్పణ కార్యక్రమంలో పాల్గొంటారు. తమిళనాడు చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్తత ఈ భారీ బంగారం విరాళం ఇస్తున్నట్లు తెలుస్తోంది. చెన్నైకి చెందిన వ్యాపారవేత్త వర్ధమాన్ జైన్ తన కంపెనీలో 60% వాటాను విక్రయించడం ద్వారా రూ.6 వేల కోట్లు సమకూరగా, అందులో కొంత భాగాన్ని శ్రీవారికి సమర్పించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు స్వామివారికి బంగారం సమర్పించారు.

ఆగమ శాస్త్రం ప్రకారం దాదాపు 15 నెలల పాటు ఎంతో నైపుణ్యంతో ఈ ఆభరణాలను తయారు చేయించినట్లు తెలుస్తోంది. ఇందులో శ్రీవారి కిరీటం, పద్మపాదాల ఆభరణాలు, భుజకీర్తులు, శంఖుచక్రాలు, వడ్డాణం, అభయ హస్తాలు ఉన్నట్లు సమాచారం. తిరుమల శ్రీవారికి ఇప్పటికే 650 కిలోల బంగారం ఉంది. ఇప్పుడు కొత్తగా 121 కిలోల బంగారం జమ కానుంది. దీంతో 771 కిలోల బంగారం కానుంది. అయితే ఈ విరాళానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications