Green Card: అమెరికాలో 7 సంవత్సరాలు ఉంటే గ్రీన్ కార్డు.. కీలక బిల్లు..!

డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత అక్కడ విదేశీయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హెచ్1బీ వీసాల ఫీజును భారీగా పెంచారు. కొత్త హెచ్-1బీ వీసాల జారీకి లక్ష డాలర్లు చెల్లించాలని స్పష్టం చేశారు. భారతీయ కరెన్సీ ప్రకారం రూ.84 లక్షలు. దీనిపై అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు అభ్యంతరం తెలిపింది. జూన్ 8న ఆ లక్ష డాలర్ల ఫీజు చట్టవిరుద్ధమని బోస్టన్‌లోని 1వ యూఎస్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ తీర్పును యథాతథంగా కొనసాగించిందని రాయిటర్స్ తెలిపింది.

తాజాగా హెచ్‌-1బీ వీసా, గ్రీన్‌కార్డ్ విషయంలో రిపబ్లికన్, డెమోక్రటిక్ సభ్యులు అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్‌) భిన్నమైన ప్రతిపాదనలు చేశారు. హెచ్‌-1బీ వీసాల జారీని మూడు సంవత్సరాల పాటు నిలిపివేయాలని ఇటీవల రిపబ్లికన్ పార్టీ సభ్యుడు టిమ్‌ షీహీ సెనెట్‌లో బిల్లు ప్రవేశపెట్టింది. తాజాగా డెమోక్రటిక్ సెనెటర్ అలెక్స్ పాడిల్లా దానికి భిన్నమైన ప్రతిపాదనలు తీసుకొచ్చారు. హెచ్‌-1బీ వీసాదారులు సహా అమెరికాలో 7 ఏళ్లుగా నివాసం ఉంటున్నవారు అక్కడ గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకొనేలా వీలు కల్పించాలని కోరారు. పాడిల్లా గత సంవత్సరం ఇమిగ్రేషన్ యాక్ట్ ఆఫ్ 1929లో వలస నిబంధనల పునరుద్ధరణ బిల్లును తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.

Green Card

వలసదారులే లక్ష్యంగా తీసుకువస్తోన్న కఠిన నిబంధనలకు కౌంటర్‌గా ఈ బిల్లులో పలు కీలక ప్రతిపాదనలు తీసుకొచ్చారు. అమెరికాలో ఏడు సంవత్సరాల పాటు నివసించినవారు శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ బిల్లు ఉపయోగపడనుంది. అయితే వారిపై ఎలాంటి క్రిమినల్ కేసులు ఉండకూడదని నిబంధనలు పెట్టారు. కొద్ది రోజుల క్రితం రిపబ్లికన్ పార్టీ సభ్యుడు టిమ్ షీహీ సెనెట్‌లో ఓ బిల్లు ప్రవేశపెట్టారు. కొత్త హెచ్‌-1బీ వీసాల జారీని మూడు సంవత్సరాల పాటు నిలిపివేయాలని బిల్లులో పేర్కొన్నారు.

ట్రంప్ యంత్రాంగం విధించిన లక్ష డాలర్ల ఫీజును చట్టబద్ధం చేయాలని సూచించారు. అమెరికన్ కార్మికుల హక్కులకు భంగం కలిగించేలా ఉన్న వీసాలను జారీ చేయకూదని స్పష్టం చేశారు. అయితే చాలా మంది భారతీయులు అమెరికా కాకుండా యూరప్ దేశాలకు వెళ్తున్నారు. అమెరికాలో కఠిన నిబంధనలు ఉండడంతో భారతీయ విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్తున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+