iPhone Gifts: ఉద్యోగులకు ఐ ఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చిన కంపెనీ..!
సాధారణంగా దీపావళికి పలు కంపెనీలు ఉద్యోగులుక స్వీట్స్ ఇస్తారు. అలా కాదంటే గిఫ్ట్స్ ఇస్తారు. అయితే ఓ కంపెనీ తమ ఉద్యోగులకు ఏకంగా ఐ ఫోన్లు గిఫ్ట్ గా ఇచ్చింది. ఢిల్లీకి చెందిన ఒక కంపెనీ తన ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్ గా ఐఫోన్ 16 స్మార్ట్ఫోన్లను ఇచ్చి ఆశ్చర్యపరిచింది. న్యూఢిల్లీలోని రోహిణిలో ఉన్న ఈ కంపెనీ ఈ వేడుకలకు సంబంధించిన ఒక వీడియోను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో
పోస్ట్ చేసింది. ఈ చిన్న వీడియోలో పండుగ వేడుకల్లో భాగంగా ఉద్యోగుల డెస్క్‌లపై ఉంచిన ఐఫోన్ 16 హ్యాండ్సెట్లు, ఒక్కోటి రిబ్బన్‌తో అలంకరించి ఉండటం కనిపించింది.
దీపావళి సమయంలో చాలా కంపెనీలు సాంప్రదాయకంగా ఉద్యోగులకు స్వీట్లు, గిఫ్ట్ హ్యాంపర్లు లేదా నిత్యావసర వస్తువులను ఇస్తుంటాయి. ఐఫోన్ గిఫ్ట్ గా ఇవ్వడం సోషల్ మీడియా వైరల్ అవుతోంది. 15-సెకన్ల నిడివి గల ఈ వీడియోలో ఉద్యోగుల డెస్క్‌లపై ఉన్న కంప్యూటర్ల ముందు తెలుపు, ఆకుపచ్చ, నీలం, నలుపుతో సహా వివిధ రంగులలో ఉన్న ఐఫోన్లు ఉంచి ఉండటం కనిపించాయి. క్లిప్ చివరిలో, పలువురు మహిళా ఉద్యోగులు తమ బహుమతులకు సంతోషంగా స్పందించడం చూడవచ్చు. వీడియోను షేర్ చేస్తూ ఆ పోస్ట్‌కు కంపెనీ "పోటీ లేదు. మీకు ఏమి దొరికింది" అని క్యాప్షన్ పెట్టింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ వీడియోపై నెటిజన్లు స్పందించారు. కొంతమంది యూజర్లు మొదట ఈ క్లిప్ నిజమైనదేనా అని ప్రశ్నించగా, మరికొందరు దీనిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తయారు చేసినవి పేర్కొన్నారు. అటువంటి ఒక కామెంట్‌కు స్పందిస్తూ కంపెనీ ఆ సూచనను నవ్వుతూ కొట్టిపారేసి, అది ఏఐ (AI) రూపొందించింది కాదని నొక్కి చెబుతూ, ఆ యూజర్‌ను వీడియోను మళ్లీ చూడమని కోరింది. ఒక యూజర్ ఆ కంపెనీలో చేరాలని ఉందని సరదాగా వ్యాఖ్యానించారు.
ఏమైనా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయా అని అడిగారు. మరొకరు ఇలాంటి బహుమతుల వీడియోలను చూసిన తర్వాత అసూయ కలగకుండా ఉండటానికి దీపావళి సమయంలో ఇన్స్టాగ్రామ్ వాడటం మానేయాల్సి రావచ్చని పేర్కొన్నారు. మహిళా ఉద్యోగులకు ఐఫోన్లు లభించగా, పురుష ఉద్యోగులకు బంగారు నాణేలు ఇచ్చారని మరొకరు కామెంట్ చేశారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications