Viral News: బిత్తరపోయిన రోజువారీ కూలీ.. రూ.37.50 లక్షలు కట్టాలని నోటీసులు.. పాన్ జాగ్రత్త..
Viral News: రోజువారీ కూలిలంటే మహా అయితే మహా అయితే వందల్లో సంపాదిస్తారు. ఎంత కాదన్నా వెయ్యికి మించి ఆదాయం ఉండదు. అలాంటి వారికి లక్షల్లో టాక్స్ కట్టాలని ఐటీ అధికారులు నోటీసులు జారీ చేస్తే ఎలా ఉంటది. అవును ఒక కూలీకి నిజంగా ఇదే జరిగింది. దీంతో అతడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అసలు ఇంతకీ మ్యాటర్ ఏమిటంటే..

టాక్స్ నోటీసులు..
బీహార్‌లోని ఖగారియా జిల్లా, మఘౌనా గ్రామానికి చెందిన గిరీష్ యాదవ్ ఒక రోజువారీ కూలీ. రోజూ పని చేసుకుంటూ సుమారు రూ.500 వరకు సంపాదిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే అతని ఒక షాకింగ్ సంఘటన ఎదురైంది. అదేంటంటే రూ.37.50 లక్షల టాక్స్ చెల్లించాలంటూ ఆదాయపు పన్ను శాఖ ఇటీవల నోటీసు జారీ చేసింది.

పోలీసు కేసు..
తన సంపాదన చాలా తక్కువని. అయినా టాక్స్ బకాయిలు ఉండటం ఏంటా అని ఆశ్చర్యానికి గురైన అతడు ఒక్కసారిగా నివ్వెరపోయాడు. దీంతో అతడు వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. గిరీష్ ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా ఇది మోసం కేసుగా అనిపిస్తోందని అలౌలి పోలీస్ స్టేషన్ ఆఫీసర్ పురేంద్ర కుమార్ తెలిపారు.

పాన్ నంబర్..
గిరీష్ యాదవ్ పేరు మీద జారీ చేసిన పాన్ నంబర్‌కు ఈ నోటీసులు వచ్చినట్లు ఆఫీసర్ పురేంద్ర కుమార్ వెల్లడించారు. తాను ఢిల్లీలో పని చేసినప్పుడు పాన్ కార్డు కోసం ప్రయత్నించినట్లు పేర్కొన్నాడు. అయితే తాను పాన్ కార్డు అందుకోలేదని వెల్లడించాడు. ఐటీ నోటీస్‌లో పేర్కొన్న రాజస్థాన్ కంపెనీ గురించి తనకు అస్సలు తెలియదని.. తాను ఎప్పుడూ కూడా రాజస్థాన్‌కు వెళ్లలేదని స్పష్టం చేశాడు. దీంతో పాన్ వివరాలను అందించేటప్పుడు కొంత జాగ్రత్త పాటించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.


Click it and Unblock the Notifications