EPFO Pension: కనీస పింఛన్ రూ.3 వేలు చేసే అవకాశం.. రూ.7,500 ఉండాలంటున్న రిటైర్డ్ ఉద్యోగులు..
ఉద్యోగం చేసుకున్నవారికి జీతంలో నెలనెలా పీఎఫ్ చందా కట్ అవుతుంది. అలాగే ఉద్యోగి నుంచి కట్ చేసిన మొత్తం యాజమాన్యం కూడా చెల్లించాల్సి ఉంటుంది. యాజమాన్యం చెల్లించే పీఎఫ్ చందాలో కొంత మొత్తం ఈపీఎస్ కు వెళ్తుంది. అంటే ఎంప్లాయి పెన్షన్ స్కీమ్ కు వెళ్తుంది. ఉద్యోగి రిటైర్డ్ అయిన తర్వాత జమ అయిన మొత్తాన్ని బట్టి పింఛన్ వస్తుంది. ప్రస్తుతం కనీస పెన్షన్ రూ.1000 ఉంది. 2014 కు ముందు కనీస పింఛన్ రూ.1000 కంటే తక్కువ ఉండేది. కానీ ఆ తర్వాత వెయ్యి చేశారు. కానీ ఇప్పుడు రూ.1000 ఏ మూలకు సరిపోవడం లేదు. అందుకే కనీస పెన్షన్ ను పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో కనీస పింఛన్ ను పెంచాలని కేంద్రం భావిస్తోంది.
ఇప్పటికే కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఆర్థిక శాఖ మంత్రులతో చర్చలు జరిపారు. కనీస పింఛన్ ను రూ.1000 నుంచి రూ.3000 వేలకు పెంచే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకోవడానికి గురువారం నాడు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో కనీస పెన్షన్ పై ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే కనీస పింఛన్ రూ.3000 సరిపోవని కార్మిక సంఘాలు, రిటైర్డ్ ఉద్యోగులు చెబుతున్నారు. తమ మెడిసిన్స్ ఖర్చుకు కూడా అవి సరిపోవని చెబుతున్నారు. కనీస పెన్షన్ రూ.7,500 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈపీఎఫ్ఓ సంస్థ వద్ద 13 శాతంతో వృద్ధి చెందుతున్న రూ.11 లక్షల కోట్ల కార్పస్ ఉందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

అయితే 2018 నాటి లెక్కలు చూపిస్తూ ఆర్థిక లోటు అని అధిక పింఛన్ ఇవ్వడం లేదని పేర్కొంటున్నారు. ఇవే కాకుండా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ముందు పలు డిమాండ్లు ఉంచారు. కాగా పింఛన్ కు సంబంధించి పీఎఫ్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరి పెన్షన్ రాదు. పింఛన్ పొందాలంటే 10 సంవత్సరాల పాటు పీఎఫ్ చందా చెల్లించాలి. అప్పుడు ఆ ఉద్యోగి ఈపీఎస్ కు అర్హుడు అవుతారు. అతనికి 58 ఏళ్లు నిండిన తర్వాత పింఛన్ వస్తుంది. ఒక వేళ పీఎఫ్ చందా 10 సంవత్సరాలు చెల్లించకుంటే.. ఆ ఉద్యోగి ఉద్యోగం మానేసినప్పుడు పీఎఫ్ డబ్బులతో పాటు ఈపీఎస్ లో జమ అయిన మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు.
ఉద్యోగం మానేసిన రెండు నెలల తర్వాత పీఎఫ్, ఈపీఎస్ ఫండ్ ను విత్ డ్రా చేసుకోవచ్చు. కాగా ఈపీఎఫ్ఓ ఈ మధ్య పీఎఫ్ కనీస జీతాన్ని రూ.25 వేలకు పెంచింది. ఉదాహరణకు ఒక ఉద్యోగి జీతం రూ.25,000 అనుకుంటే.. అతని జీతంలో పీఎఫ్ ఖాతాకు రూ.3 వేలు చందాగా వెళ్తుంది. అయితే కొన్ని కంపెనీలు మొత్తం ఉద్యోగి ఖాత నుంచే కట్ చేస్తారు. దీంతో ఉద్యోగి జీతంలో దాదాపు రూ.6 వేలు కట్ అయ్యే అవకాశం ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications