కాలం కలిసొస్తే ఏదైనా జరగొచ్చు అని మరోసారి రుజువైంది. ఒకప్పుడు దీని వాళ్ళ ఏంటి లాభం అనుకున్న వాళ్లే ఇప్పుడు దాని విలువ తెలిసి అవాక్కవుతున్నారు. షేర్స్ కొనడం అమ్మడం ఇప్పుడు సాధారణం అయిపోయింది. కానీ షేర్స్ వల్ల లాభాలు రావటం అనేది ఒక అదృష్టం కూడా. ఈ రోజుల్లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు చాల మంది ఉన్నారు. అయితే షేర్స్ కొనడం వల్ల ఉన్నట్టుండి లక్షాధికారిగా మారితే ఎలా ఉంటుంది... ఊహిస్తేనే ఆశ్చర్యంగా ఉంది కదా...ఇలాంటి ఘటనే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
చండీగఢ్ నివాసి రతన్ ధిల్లాన్ ఇల్లు శుభ్రం చేస్తుండగా కొన్ని పేపర్స్ దొరికాయి, అవి కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అవును, ఈ పేపర్స్ దేని గురించి అని రతన్ ధిల్లాన్ అర్థం చేసుకోలేకపోయాడు. కానీ మార్చి 11న వాటి ఫోటోలను మైక్రోబ్లాగింగ్ సైట్ X (@ShivrattanDhil1)లో పోస్ట్ చేసి నిపుణుల సహాయం కోరాడు. అతను చేసిన పోస్ట్‌లో ఈ పాత పేపర్స్ మా ఇంట్లో దొరికాయి, కానీ నాకు స్టాక్ మార్కెట్ గురించి పెద్దగా తెలియదు. మా దగ్గర ఇంకా ఈ షేర్లు ఉన్నాయో లేదో ఎవరైనా చెప్పగలరా ? అంటూ పోస్ట్ చేసాడు.

అసలు విషయం ఏంటంటే : సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం రతన్ ధిల్లాన్ షేర్ చేసిన పేపర్స్ అతని కుటుంబం 1987 నుండి 1992 మధ్య రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL)లో 30 షేర్లను కొనుగోలు చేసినట్లు చూపిస్తున్నాయి. 1987లో మొదట 20 షేర్లు, ఆ తర్వాత 1992లో 10 షేర్లు. అప్పట్లో వాటి ధర ఒక్కో షేరుకు కేవలం రూ.10 మాత్రమే. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత ఈ షేర్ల విలువ ఎంత ఉంటుందనే ప్రశ్న తలెత్తుతుంది?
షేర్స్ విలువ 11 లక్షలకు పైగా : రతన్ ధిల్లాన్ పోస్ట్ గురించి ఒక యూజర్ సమాచారం ఇస్తూ గత 30 సంవత్సరాలలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మూడుసార్లు స్టాక్ స్ప్లిట్ చేసి రెండుసార్లు బోనస్ జారీ చేసిందని చెప్పారు. ఈ లెక్క ప్రకారం అప్పుడు ఉన్న 30 షేర్లు ఇప్పుడు దాదాపు 960 షేర్లుగా మారాయి. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం వాటి ధర దాదాపు రూ.11.88 లక్షలు ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి.
సోషల్ మీడియాలో ఫన్నీ రియాక్షన్లు: ఈ పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఒక యూజర్ సరదాగా బ్రదర్, మీరు జాక్ పాట్ కొట్టారు! మరొకరు రతన్ భాయ్, ఇంటిని ఇంకా బాగా వెతకండి, ఎవరికి తెలుసు మీకు MRF షేర్లు కూడా దొరుకుతాయో అని రిప్లయ్ చేసారు. ఇంకా ఈ పోస్టుకి భారీగా లైకులు, రిట్విట్లు వచ్చాయి. ఎంతో మంది రకరకాలుగా కామెంట్స్ కూడా చేసారు. పాత వస్తువులలో లేదా ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు దాచినవి బయటపడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి, నేడు వాటి విలువ లక్షల్లో, కోట్లకు చేరుకుంది. మీ అదృష్టం ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు!


Click it and Unblock the Notifications