Cab Driver: ప్రయాణికులను దింపడానికి వెళ్లి.. రూ. 3 కోట్లు గెలుచుకున్న క్యాబ్ డ్రైవర్..
అదృష్టం అనేది ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో తెలియదు. కొందరు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతారు. అయితే ఇలా జరిగేది చాలా తక్కువ మందికి మాత్రమే. ఇలాంటి కోవలోకే వస్తాడు హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లా ఫతేపూర్ ప్రాంతానికి చెందిన కల్యాణ్ చంద్. చంద్ స్వయం ఉపాధిలో భాగంగా కారు కొనుగోలు చేసి క్యాబ్ నడిపిస్తున్నాడు. అతను దేశంలోని చాలా ప్రాంతాలకు ప్రయాణికులను తీసుకెళ్లాడు. క్యాబ్ పై వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకునే వాడు. అయితే కొద్ది రోజుల క్రితం అతనికి పంజాబ్ వెళ్లేందుకు గీరాకి వచ్చింది. అయితే మొదట్లో అంత దూరం ఏం వెళ్దామని అనుకున్నాడు.
అయితే మంచి గీరాకి వచ్చింది. వెళ్తే డబ్బులు వస్తాయి కదా అని తోటి క్యాబ్ డ్రైవర్లు చెప్పారు. దీంతో అతను ప్రయాణికులను తీసుకుని పంజాబ్ కు తీసుకెళ్లారు. ప్యాసింజర్లను చేర్చాల్సిన చోట దింపాడు. తిరిగి బయల్దేరుదామని అనుకున్నాడు. అయితే కాస్త అలసటగా ఉండడంతో కల్యాణ్ చంద్ బఠిండా బస్టాండ్ దగ్గరలో కారు పక్కకు ఆపి కాసేపు కునుకు తీశాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న రతన్ లాటరీ స్టాల్ దగ్గరికి వెళ్లాడు. ఎప్పటి నుంచో లాటరీ టికెట్ కొందమని అనుకుంటున్న చంద్. అప్పుడే లాటరీ కొనుగోలు చేద్దామని నిర్ణయించుకున్నాడు. అతను తనకు లాటరీ తగులుతుందని అనుకోలేదు కానీ టికెట్ కొనేశాడు. రూ.500 చెల్లించి టికెట్ తీసుకున్నాడు.

వారం రోజుల తర్వాత లాటరీ ఫలితాలు వచ్చాయి. చంద్ కొన్న లాటరీ టికెట్ ఫస్ట్ ప్రైస్ వచ్చింది. మొదటి బహుమతి కింద ఆయనకు రూ.3 కోట్లు వచ్చాయి. మొదటగా లాటరీ నిర్వాహకులు చంద్ ఫోన్ చేసి ఫలితాల్లో మీ నంబర్ మొదటి బహుమతి గెలిచిందని చెబితే నమ్మలేదు. కానీ ఆ తర్వాత పూర్తి వివరాలను చెప్పడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కల్యాణ్ చంద్ కు రూ.3 కోట్ల లాటరీ తగిలిందని తెలియగానే ఆయన స్వగ్రామంలో అందరు షాకయ్యారు. కష్టాల్లో ఉన్న పేద క్యాబ్ డ్రైవర్ కు లాటరీ రావడంపై పలువురు ఊరి ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
ఇప్పటి వరకు అద్దె ఇంట్లో చంద్ సొంత ఇల్లు కట్టుకుంటామని చెప్పారు. తనకున్న అప్పులు తీర్చేస్తామని తెలిపారు. ఈ లాటరీ డబ్బుతో తన కుటుంబ కష్టాలను తీర్చడమే కాకుండా, పిల్లల చదువులకు, భవిష్యత్ వ్యాపారాలకు వాడుకుంటానని వివరించారు. కాగా క్యాబ్ డ్రైవర్ రూ.3 కోట్ల లాటరీ వచ్చిందన్న వార్త దేశవ్యాప్తంగా వైరల్ అయింది.
ఆయన సంతోషంగా వెల్లడించారు. ఈ అద్భుతమైన లక్కీ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే గతంలో కూడా చాలా మంది లాటరీలో అదృష్టం వరించడం వల్ల కోటీశ్వరులు అయ్యారు. అయితే ఈ లాటరీ టికెట్లు అమ్మె సంస్కృతి ఎక్కువగా దుబాయ్ వంటి దేశాల్లో ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో పలు రాష్ట్రాల్లో లాటరీ టికెట్లు విక్రయిస్తున్నారు.


Click it and Unblock the Notifications