Hyderabad: హైదరాబాదీలకు తప్పనున్న ట్రాఫిక్ కష్టాలు.. 9 కి.మీ. భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం..!
హైదరాబాద్ మహానగరం రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. భాగ్యనగరం కొన్ని చోట్ల ఔటర్ రింగ్ దాటి పోయింది. ఈ నేపథ్యంలో సిటీలో నివసించే వారి సంఖ్య భారీగా పెరిగింది. వాహనాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. కానీ అందుకు తగ్గట్లు రోడ్లు మాత్రం పెరగలేదు. దీంతో వాహనదారులు రోడ్డు ఎక్కలంటేనే భయపడిపోతున్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజరాహిల్స్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ప్రభుత్వం ఫ్లైఓవర్లు ఏర్పాటు చేసినా ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగా బంజారాహిల్స్ నుంచి గచ్చిబౌలిలోని శిల్పా లేఅవుట్ వరకు నిర్మించతలపెట్టిన ఎలివేటెడ్ కారిడార్‌కు సంబంధించి హెచ్‌ఎండీఏ తాజాగా టెండర్లు ఆహ్వానించింది. సెప్టెంబర్ 22వ తేదీలోపు ఆన్‌లైన్ ద్వారా బిడ్లు స్వీకరిస్తామని ప్రకటించింది. టెండర్లు ఖరారైన తర్వాత పనులకు ప్రారంభిస్తారని వెల్లడించింది. ఈ ఎలివేటెడ్ కారిడార్ అందుబాటులోకి వస్తే బంజారాహిల్స్, ఐటీ కారిడార్ ప్రయాణికులకు ట్రాఫిక్ నుంచి ఉపశమనం లభించనుంది. ఈ ఎలివేటెడ్ కారిడార్ ను బంజారాహిల్స్ రోడ్డు నంబరు 12 నుంచి గచ్చిబౌలి సమీపంలోని శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ వరకు నిర్మించనున్నారు.

దీని పొడవు 9 కిలోమీటర్ల పొడవు ఉండనుంది. పశ్చిమ హైదరాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే ప్రధాన కూడళ్ల మీదుగా ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. రూ.1656 కోట్ల అంచనా వ్యయంతో డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్(డీబీఎఫ్‌వోటీ) ప్రాతిపదికన ఈ కారిడార్‌ను నిర్మిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ ను రెండు భాగాలుగా విభజించి నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు డీపీఆర్ ఇప్పటికే సిద్ధం చేశారు. మొదటి దశలో ఫిలింనగర్ నుంచి శిల్పా లేఅవుట్ వరకు 5 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తారు. రెండో దశలో బంజాహిల్స్ రోడ్ నంబర్ 12లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి హకీంపేట్ కుంట వరకు 4 కి.మీ. దూరం ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు.
ఈ 9 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్ లో ఆరు కీలక రద్దీ ప్రాంతాల్లో ర్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. ఫిలింనగర్, నార్నే రోడ్, జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 52, ఐటీసీ కోహినూర్ రోడ్, టీ హబ్ జంక్షన్, మైండ్‌స్పేస్ ర్యాంపులు ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు చేశారు. ఈ మార్గల్లో మెట్రో నిర్మాణం చేపడితే ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఈ ఎలివేటెడ్ కారిడార్ ను డిజైన్ చేశారు. అయితే ఈ ఎలివేటెడ్ కారిడార్ అందుబాటులోకి రావాలంటే మూడు నుంచి నాలుగు సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
