Lay Off: కార్పొరేట్ ఉద్యోగి నుంచి డెలవరీ బాయ్ వరకు.. 56 ఏళ్ల వ్యక్తి కథ ఇది..!
జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరు ఊహించలేరు. ఈ రోజు బాగున్న వారు రేపు ఏమవుతారో చెప్పలేం. ముఖ్యంగా కార్పొరేట్ జాబ్ చేస్తున్నవారు ఏ క్షణమైన తమ ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది. అయితే కొంత మంది ఉద్యోగం కోల్పోతే తమ పని అయిపోయిందని అనుకుంటారు. కానీ.. జాబ్ పోతే జీవితమే పోయినట్లు కాదని ఓ పెద్దాయన నిరూపించాడు. అందుకే ఎప్పుడైనా ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉండాలని చెబుతున్నారు. ఇలానే పెద్ద మనిషి తన ఉద్యోగం పోయినా.. కష్టపడుతూ జీవితం ముందుకెళ్తున్నాడు. నోయిడాకు చెందిన సామాజిక కార్యకర్త కిరణ్ వర్మ పోర్టర్ లో రైడ్ బుక్ చేశాడు.
దాని డెలవరీ ఛార్జీ రూ.40. డెలివరీ బాయ్ వచ్చి కిరణ్ శర్మకు లెటర్ ఇచ్చాడు. డెలవరీ బాయ్ అంటే 20 నుంచి 30 మధ్య ఉంటాడనుకున్నాడు కిరణ్ శర్మ. కానీ వచ్చిన అతను 56 ఏళ్ల పెద్దాయన. అయితే పెద్దాయన మాటలు, ప్రవర్తన ప్రొఫెషనల్ స్థాయిలో ఉన్నాయి. సార్ మీ డెలవరీ వచ్చిందని అతను ఫోన్ చేయడం, స్వయంగా మెట్లెక్కి వచ్చి ఆ డెలవరీ ఇవ్వడం. ఆయన మాటల్లో హుందాతనం కనిపించడం.. కిరణ్ శర్మకు ఆ పెద్దాయన గురించి తెలుసుకోవాలని అనిపించింది. ముందుగా నీళ్లు తాగుతారా అని అడిగాడు. కానీ ఆయన వద్దు సార్ అని చెప్పాడు.

మీ వయస్సు ఎక్కువగా.. ఉంది.. డెలవరీ జాబ్ ఎప్పటి నుంచి చేస్తున్నారని కిరణ్ అడిగారు. దానికి సమాధానం ఇస్తూ.. సార్ "నా పేరు మనోజ్, నా వయసు 56 సంవత్సరాలు. నేను గతంలో టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో అడ్మినిస్ట్రేషన్ విభాగంలో 14 సంవత్సరాలు పని చేశాను. 2023 కంపెనీలో లే ఆఫ్స్ జరిగాయి. ఆ లే ఆఫ్స్ లో నా ఉద్యోగం పోయింది. వయసు, ఆరోగ్య కారణాలతో వేరే ఉద్యోగం దొరకలేదు. అందుకే ఇలా డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాను" అని అన్నాడు. దీంతో కిరణ్ శర్మ ఆశ్చర్యపోయాడు. డెలివరీ చేసే వ్యక్తిలో ఒకప్పుడు కార్పొరేట్ ఉద్యోగి ఉండడం ఎప్పుడు ఎలా ఉంటుందో కిరణ్ శర్మకు అర్థమైంది.
అంత సీనియర్ ఎలా ఉద్యోగం నుంచి తీసేశారని అడగ్గా.. మనం కర్రీ చేసేటప్పుడు అందులో కరివేపాకు వేస్తాం. అదే ఆ కర్రీ తినేటప్పుడు కొంత మంది కరివేపాకును తీసివేస్తారు. కార్పొరేట్ సంస్థల్లో కూడా అంతేనని వివరించాడు. ఎన్నో సంవత్సరాలు అనుభవంతో కంపెనీకి సేవలు చేసిన ఉద్యోగుల అవసరం తీరిన తర్వాత తీసేయడం కామన్ అని చెప్పాడు. అయితే జీవితంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చిన ఎదుర్కొవాలని చెప్పాడు. అయితే మనోజ్ లే ఆఫ్స్ కారణం తెలియనప్పటికీ కార్పొరేట్ ఉద్యోగాలు శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని కిరణ్ శర్మ చెబుతున్నారు.
మనోజు వెళ్లిపోతున్నప్పుడు.. అతనికి డెలివరీ ఛార్జీ కంటే ఎక్కువ మొత్తం ఇచ్చినట్లు చెప్పాడు. అయితే అది డబ్బు సాయం కాదని.. ఓ మనిషి మరో మనిషి కష్టాన్ని గుర్తించి ఇచ్చిన ప్రోత్సాహకమని అన్నారు.


Click it and Unblock the Notifications