ఎలోన్ మస్క్ స్పేస్ ఎక్స్‌ప్లోరర్ కంపెనీ SpaceXలోకి కొత్త ఉద్యోగి రానున్నాడు. స్పెస్ ఎక్స్ లోకి వచ్చే ఉద్యోగి అంటే ఏ 40 ఏళ్లు, 50 ఏళ్లు ఉంటాయనుకుంటే పొరపాటుడడ్డాట్లే. ఎందుకంటే స్పెస్ ఎక్స్ లో చేరబోయేది 14 ఏళ్ల బాలుడు. అవును వయస్సుతో సంబంధం లేకుండా కైరన్ క్వాజీ అనే బాలుడు స్పెస్ ఎక్స్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా అడుగు పెట్టబోతున్నాడు.
శాంటా క్లారా యూనివర్శిటీ గ్రాడ్యుయేట్ అయిన కైరాన్ క్వాజీ త్వరలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా తన ఉద్యోగాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాడు. అతను లింక్డ్‌ఇన్ పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించాడు. SpaceX ఉద్యోగంలో చేర్చుకునేందుకు పరిపక్వత సామర్థ్యం పరిగణలోకి తీసుకోని అరుదైన కంపెనీలలో ఒకటని పేర్కొన్నాడు.

"ఇది నా లింక్డ్‌ఇన్ "నేను ప్రకటించడానికి సంతోషిస్తున్నాను.పోస్ట్ అవుతుందని నేను ఊహిస్తున్నాను! నేను శాంటా క్లారా యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి గ్రాడ్యుయేట్ చేస్తున్నాను. అక్కడ మిషన్‌తో ఇంజనీరింగ్ అనేది జిమ్మిక్కీ కాదని నేను తెలుసుకున్నాను" అని క్వాజీ యొక్క లింక్డ్‌ఇన్ పోస్ట్ రాసుకొచ్చాడు.
క్వాజీ కేవలం 2 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు స్పష్టంగా మాట్లాడడం నేర్చుకున్నాడని లాస్ ఏంజిల్స్ టైమ్స్ తెలిపింది. అతను 9 సంవత్సరాల వయస్సులో 3వ తరగతిలో ఉన్నప్పుడు తన పాఠశాల తనకు తగినది కాదని భావించాడు. కాలిఫోర్నియాలోని ఒక కమ్యూనిటీ కళాశాలలో అడ్మిషన్ తీసుకున్నాడు.
క్వాజీ కొన్ని ప్రతిష్ఠాత్మక కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేయడంతో అత్యాధునిక సాంకేతికతలపై అవగాహన పెంచుకున్నాడు. అసోసియేట్ ఆఫ్ సైన్స్ (మేథమేటిక్స్)లో అత్యున్నత గ్రేడ్‌తో ఉత్తీర్ణత సాధించాడు.టెల్ ల్యాబ్స్‌లో డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్ రీసెర్చ్ ల్యాబ్ డైరెక్టర్ లామా నచ్‌మన్‌తో కలిసి జనరేటివ్ ఏఐపై పనిచేశాడు.


Click it and Unblock the Notifications