Bengaluru: గుడ్ న్యూస్.. ప్రజల కోసం ప్రత్యేక యాప్ తీసుకొచ్చిన 14 ఏళ్ల బాలుడు..

బెంగళూరులో ట్రాఫిక్ సమస్య గురించి పెద్ద చెప్పాల్సిన పని లేదు. అక్కడ కిలో మీటర్ దూరం వెళ్లడానికి చాలా సమయం పడుతుంది. దీని ప్రధాన కారణం రోడ్లు చిన్నగా ఉండడం, జనాభా పెరగడంతో పాటు ఫుట్ పాత్ ఆక్రమణ కూడా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. బెంగళూరులో ఫుట్ పాత్ లపై ఎక్కడి పడితే అక్కడ ఆక్రమణలు చేస్తున్నారు. దీంతో పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది గమనించిన 14 ఏళ్ల విద్యార్థి.. ఈ సమస్యకు పరిష్కారం కనుగోనే దిశగా ఆలోచించాడు. సాంకేతికతతో సమస్యను పరిష్కరించాలని నిర్ణయించుకున్నాడు.

తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం సహకారంతో సూర్య ఉత్కర్ష ఓ యాప్ ను రూపొందించాడు. రాస్తే(Raste) యాప్ ను రూపొందించారు. ఈ యాప్ ద్వారా ఫుట్ పాత్ పై ఆక్రమణల గురించి నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఈ యాప్ ను బెంగళూరులోని ప్రజలు ఎక్కువగా వాడుతున్నారు. చిన్న వయసులోనే యాప్ తీసుకొచ్చి.. సామాజిక సమస్యకు పరిష్కారం కనుగొన్న సూర్య ఉత్కర్ష ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ బాలుడు తీసుకొచ్చిన యాప్ సింపుల్ గా ఆపరేట్ చేయవచ్చని చెబుతున్నారు. ఫుట్ పాత్ పై ఎక్కడైనా ఆక్రమణ కనిపిస్తే.. దాని ఎవరైనా ఫొటో తీసి రాస్తే యాప్ లో అపలోడ్ చేసి అడ్రస్ సెండ్ చేయలి.

app

ఆ ఫిర్యాదు వెంటనే అధికారులు చూస్తారు. ఫుట్ పాత్ ఆక్రమణ ఎక్కడ అయిందో అక్కడికి వెళ్లి ఆక్రమణను తొలగిస్తారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా ప్రభుత్వ వ్యవస్థకు చేరవేసే వారధిగా ఈ యాప్ పని చేస్తుందని పలువురు చెబుతున్నారు. ఈ యాప్ కు బెంగళూరు వాసుల నుంచి మంచి స్పందన వస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఈ యాప్ 10 వేల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. 1000 పైగా ఈ యాప్ ద్వారా ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించి ఆక్రమణలు తొలగించారు.

కేవలం ఫిర్యాదులు స్వీకరించడం మాత్రమే కాకుండా.. ఈ డేటాను భవిష్యత్ ప్రణాళికలకు ఉపయోగించుకోవచ్చని సూర్య వివరిస్తున్నాడు. పదేపదే ఆక్రమణలు జరిగే ప్రాంతాలను గుర్తించి.. సమస్యకు మూల కారణాలను విశ్లేషిస్తే ఫుట్‌పాత్‌లు మళ్లీ ఆక్రమణలకు గురికాకుండా చూడవచ్చని చెబుతున్నాడు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల డేటాను ఉపయోగించడం, ఫుట్‌పాత్ శుభ్రపరిచే చర్యలకు ముందు-తర్వాత ఫొటోలను ప్రజలకు అందుబాటులో ఉంచడం, వార్డు స్థాయి హీట్ మ్యాప్‌ల ద్వారా సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలని బాలుడు కోరుతున్నాడు. ఈ యాప్ ను అధికార యాప్ గా తీసుకురావాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+