9K Gold: బంగారం అంటేనే మనందరికీ మొదట గుర్తొచ్చేది 24 క్యారెట్లు, 22 క్యారెట్లు లేదా 18 క్యారెట్ల బంగారమే. అయితే వీటితో పాటుగా మరో క్యారెట్ బంగారం కూడా మార్కెట్లో ఉంది. అదే 9K Gold. ఈ 9 క్యారెట్ల బంగారం గురించి చాలా మందికి అంతగా అవగాహన ఉండదు. చాలా తక్కువ ధరలో దొరికే ఈ బంగారం ఇటీవలే అధికారికంగా గుర్తింపు సంపాదించింది. ప్రస్తుతం 24 క్యారెట్లు లేదా 22 క్యారెట్ల బంగారం ధరలు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. అందువల్ల సాధారణ ప్రజలకు ఈ బంగారం కొనడం భారమైపోతోంది. అలాంటి పరిస్థితిలో 9 క్యారెట్ల బంగారం ఒక కొత్త ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది.
ఇటీవలి కాలంలో బంగారం ధరలు ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా అమెరికా బంగారు కడ్డీలపై సుంకం విధించాలనే నిర్ణయం కారణంగా, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగిపోయాయి. ఈ ప్రభావం భారత మార్కెట్‌పైనా బలంగా పడింది. జూన్‌లో దేశవ్యాప్తంగా బంగారం అమ్మకాలు 60 శాతం తగ్గడం దీనికి ఉదాహరణ. అయితే బంగారం పట్ల భారతీయుల మక్కువ తగ్గదు. పెళ్లిళ్లు, పండుగలు, పెట్టుబడులు అన్నింటికీ బంగారం అవసరం అవుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో వినియోగదారుల అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం ఇటీవల ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

ఇప్పటివరకు భారతదేశంలో 14K, 18K, 20K, 22K, 23K, 24K బంగారమే హాల్‌మార్క్ గుర్తింపు పొందేవి. అయితే 2025 ఆగస్టు నుండి 9 క్యారెట్ల బంగారం కూడా హాల్‌మార్క్ జాబితాలో చేరింది. అంటే ఇప్పుడు వినియోగదారులు 9K బంగారం కొనుగోలు చేసినా, హాల్‌మార్క్ ముద్రతో నాణ్యతకు హామీ లభిస్తుంది అని చెప్పుకోవచ్చు.
9 క్యారెట్ల బంగారం అంటే ఏమిటి? 24 క్యారెట్ల బంగారం అంటే 99.9% స్వచ్ఛమైన బంగారం అని అర్థం. కానీ 9 క్యారెట్ల బంగారంలో కేవలం 37.5% స్వచ్ఛమైన బంగారం మాత్రమే ఉంటుంది. మిగతా 62.5% శాతాన్ని రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలతో కలిపి తయారు చేస్తారు. దీని వలన 9K గోల్డ్ తక్కువ ఖర్చుతో దొరుకుతుంది. అలాగే దీనికి తగినంత బలం, మన్నిక కూడా వస్తుంది.
ఎందుకు 9 క్యారెట్ల బంగారం?: భారీ ధరలతో ఉన్న 22K లేదా 24K బంగారాన్ని అందరూ కొనలేరు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు, గ్రామీణ వినియోగదారులు, యువత... వీరికి తక్కువ ధరలో బంగారం కావాలి. ఇలాంటి వారికి 9K గోల్డ్ సరైన ఆప్షన్ అవుతుంది. అంతేకాకుండా హాల్‌మార్క్ ఉన్నందువల్ల నాణ్యతపై ఎలాంటి సందేహం ఉండదు. తక్కువ పెట్టుబడితో పసిడి ప్రియులకు బంగారం కలిగించే సంతోషాన్ని ఇది అందిస్తుంది.
ధరలను పరిశీలిస్తే.. 24K బంగారం ఒక గ్రాము ధర రూ. 10,000 కంటే ఎక్కువ. అంటే 10 గ్రాముల కోసం లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేయాలి. అదే 9K బంగారం ఒక గ్రాము ధర సుమారు రూ. 3,700. అంటే 10 గ్రాముల బంగారం కోసం కేవలం రూ. 37,000 ఉంటే సరిపోతుందన్నమాట. ఇక పెట్టుబడి కోణంలో చూసుకుంటే 24K లేదా 22K బంగారం విలువ ఎక్కువగా ఉంటుంది. కానీ ఫ్యాషన్ జ్యువెలరీ, రోజువారీ ఉపయోగం, తక్కువ ఖర్చుతో ఆభరణాలు కావాలనుకునే వారికి 9K గోల్డ్ ఉత్తమమైన ఎంపికగా చెప్పుకోవచ్చు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

Gold prices: వెండితో పోలిస్తే బంగారం సేఫేనా? ఈ రిపోర్ట్ చూస్తే మీ పెట్టుబడి ప్లాన్ మార్చుకుంటారు!

Gold Prices: గోల్డ్ మార్కెట్లో అతిపెద్ద క్రాష్! ఇప్పుడు కొనాలా? అమ్మాలా? నిపుణుల సలహా ఇదే..!

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications