కోక్, ఐస్ క్రీం, స్నాక్స్, పాప్‌కార్న్... ఆరేళ్ల పిల్లాడిలా 94 ఏళ్ల వారెన్ బఫెట్...

అమెరికన్ లెజెండరీ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ ఈ ఏడాది చివరిలో బెర్క్‌షైర్ హాత్వే సిఇఒ పదవి నుంచి రిటైర్మెంట్ కానున్నారు. అయితే కంపెనీ అన్యువల్ సమావేశంలో ఈ పదవిని వైస్-చైర్మన్ గ్రెగ్ అబెల్‌కు అప్పగిస్తున్నట్లు చెప్పారు. 94 ఏళ్ల బఫెట్ ప్రపంచంలోనే అత్యంత సక్సెస్ ఫుల్ పెట్టుబడిదారుడిగా పరిగణిస్తారు అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పెట్టుబడిదారులు ఆయనను ఫాలో అవుతున్నారు కూడా. బఫెట్ బెర్క్‌షైర్ హాత్వేను పడిపోయిన వస్త్ర తయారీ కంపెనీ నుండి $1.16 ట్రిలియన్ పెట్టుబడి సామ్రాజ్యంగా మార్చాడు. నేడు అది ప్రపంచంలోని టాప్ 10 కంపెనీలలో ఒకటి.

94-year-old Warren Buffett habits suprises eats like a six-year-old child drinks 5cokes daily

కానీ బఫ్ఫెట్ లైఫ్ స్టయిల్ గురించి చాలా మందికి తక్కువగా తెలుసు. అతని జీవితం, ఇష్టాలు, అయిష్టాల గురించి బయట ప్రపంచానికి పెద్దగా ఎవరికీ తెలియదు. ఆయన 30 ఆగస్టు 1930న ఒమాహాలో జన్మించారు. అతను నెబ్రాస్కా-లింకన్ యూనివర్సిటీ అండ్ కొలంబియా బిజినెస్ స్కూల్‌లో చదివాడు. 94 ఏళ్ల వయసులో కూడా బఫెట్ రోజుకు ఐదు కోకాకోలా డబ్బాలు, మార్కెట్ మూడ్‌ను బట్టి మెక్‌డొనాల్డ్స్ అల్పాహారం, ఎటువంటి వ్యాయామం లేకుండా జీవిస్తున్నాడు. అతని ఆహార ఇంకా త్రాగే అలవాట్లు చాలా చిన్న పిల్లాడిలా ఉంటాయి. ఇందులో వారానికి కనీసం మూడు సార్లు మెక్‌డొనాల్డ్స్ చికెన్ మెక్‌నగ్గెట్స్, స్నాక్స్ కోసం చిప్స్, డెజర్ట్ కోసం ఐస్ క్రీం, ప్రతిరోజూ ఐదు కోకా-కోలా టిన్స్ తాగడం ఉన్నాయి.

అయితే అతను 94 సంవత్సరాలుగా నేను నాకు నచ్చింది తాగుతున్నాను, నాకు నచ్చింది చేస్తున్నాను అని అతని పై ఉన్న అంచనాలను కొట్టిపారేశాడు. ఇంకా నేను చార్లీ ఎప్పుడూ పెద్దగా వ్యాయామం చేయలేదు. జాగ్రత్తగా మమ్మల్ని మేము రక్షించుకున్నాము. వారెన్ బఫెట్ పాత స్నేహితుడు అలాగే బెర్క్‌షైర్ హాత్వే వైస్ చైర్మన్ ఆయిన్ చార్లీ ముంగర్ నవంబర్ 2023లో 99 సంవత్సరాల వయసులో మరణించాడు. బెర్క్‌షైర్ కోకాకోలా పానీయాల కంపెనీలో చాలా కాలంగా పెట్టుబడి పెట్టింది. 1990ల నుండి బఫెట్ దినచర్య పెద్దగా మారలేదు. ఇంకా అనారోగ్యకరమైనవిగా పరిగణించబడే హాట్ డాగ్‌లు, ఫ్రైస్, పాప్‌కార్న్, కుకీలు, క్యాండీలను తినడానికి ఇష్టపడతారు.

ఆరేళ్ల పిల్లాడిలా: వారెన్ బఫెట్ ఇప్పటికీ 1958లో $31,500కి కొన్న అదే ఒమాహా ఇంట్లో ఉంటున్నారు. ఇంకా రోజు తప్పకుండా అల్పాహారం కోసం మెక్‌డొనాల్డ్స్‌కు వెళ్తాడు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మెక్‌డొనాల్డ్స్ అల్పాహారం స్టాక్ మార్కెట్ పర్ఫార్మెన్స్ పై ఆధారపడి ఉంటుంది. మార్కెట్ బుల్లిష్‌గా ఉంటే బేకన్, గుడ్లు, చీజ్ బిస్కెట్లపై తింటానని, మార్కెట్ పడిపోతే రెండు సాసేజ్‌ల ప్యాటీ ఆర్డర్‌ను చేస్తానని చెప్పాడు. వారెన్ బఫెట్ పగటిపూట సాధారణ కోక్, రాత్రి చెర్రీ కోక్‌ను ఇష్టపడతారు. అతను ప్రతిరోజూ క్వీన్ ఐస్ క్రీం కూడా ఆస్వాదిస్తానని తెలిపారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+