టాప్ టెన్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.2.51 లక్షల కోట్లు పెరిగింది. ఇందులో దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) టాప్ గెయినర్‌గా నిలిచింది. గతవారం బీఎస్ఈ సెన్సెక్స్ 1367 పాయింట్లు లేదా 2.66 శాతం లాభపడింది. సెన్సెక్స్ 52,727 పాయింట్ల వద్ద ముగిసింది. టాప్ 10లోని తొమ్మిది కంపెనీలు గతవారం లాభాల్లో ముగియగా, దేశీయ అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రం నష్టపోయింది. టాప్ టెన్‌లో ఈ ఒక్క కంపెనీ మాత్రమే నష్టపోయింది.
గతవారం టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.74,534.87 కోట్లు పెరిగి రూ.12,04,907.32 కోట్లకు చేరుకుంది. హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ రూ.44,888.95 కోట్లు ఎగిసి రూ.5,41,240.10 కోట్లకు, HDFC బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.35,427.18 కోట్లు ఎగిసి రూ.7,51,800.31 కోట్లకు, HDFC మార్కెట్ క్యాప్ రూ.24,747.87 కోట్లు పెరిగి రూ.3,97,190.50 కోట్లకు, ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.22,888.49 కోట్లు లాభపడి రూ.6,06,734.50 కోట్లకు, ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.17,813.78 కోట్లు పెరిగి రూ.4,96,354.36 కోట్లకు, భారతీ ఎయిర్ టెల్ మార్కెట్ క్యాప్ రూ.15,185.45 కోట్లు ఎగిసి రూ.3,68,789.63 కోట్లకు, ఎస్బీఐ మార్కెట్ క్యాప్ 11,914.36 కోట్లు లాభపడి రూ.4,05,489.73 కోట్లకు, ఎల్ఐసీ మార్కెట్ క్యాప్ రూ.4,427.5 కోట్లు పెరిగి రూ.4,18,525.10 కోట్లకు పెరిగింది.

అదే సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ.59,901.07 కోట్లు నష్టపోయి రూ.16,91,785.45 కోట్లకు దిగి వచ్చింది. టాప్ టెన్ కంపెనీల్లో రిలయన్స్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా టీసీఎస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్, ఐసీఐసీఐ బ్యాంకు, ఎల్ఐసీ, ఎస్బీఐ, HDFC, భారతీ ఎయిర్ టెల్ ఉన్నాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications