For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Nitin Gadkari: ఏప్రిల్ 1 నుంచి ఆ వాహనాలకు 'NO' ఎంట్రీ.. నితిన్ గడ్కరీకి మహీంద్రా థ్యాంక్స్..

|

Nitin Gadkari: కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వాహనాల విషయంలో కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 1, 2023 నుంచి 9 లక్షల వాహనాలు రోడ్లపైకి రావని ఆయన వెల్లడించారు. దేశంలో వాయుకాలుష్యాన్ని తగ్గించటంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

వాహనాల స్క్రాపేజ్ పాలసీ..

వాహనాల స్క్రాపేజ్ పాలసీ..

కొన్ని రోజుల కిందట కేంద్ర ప్రభుత్వం వాహనాల స్క్రాపేజ్ పాలసీ గురించి ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా 15 ఏళ్ల కంటే పాతవైన పెట్రోల్ వాహనాలు, 10 ఏళ్ల కంటే పాత డీజిల్ వాహనాల పర్మిట్ రద్దు చేయాలని నిర్ణయించింది. 15 ఏళ్లు దాటిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల వాహనాలకు చెందిన 9 లక్షల వాహనాలను తొలగించనున్నట్లు రోడ్డు రవాణా, హైవే మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.

FICCI సమావేశంలో..

దేశంలో రవాణా వ్యవస్థలో కర్బన ఉద్ఘారాలను తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. దీనిని సాధించేందుకు ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలు, ఇథనాల్, మిథనాల్, బయో-సీఎన్‌జీ, బయో-ఎల్‌ఎన్‌జీ వినియోగాన్ని ప్రోత్సహించింది. ఇలాంటి చర్యల వల్ల వాయు కాలుష్యం తగ్గుతుందని కేంద్రం భావిస్తోంది.

 ఆనంద్ మహీంద్రా..

ఆనంద్ మహీంద్రా..

దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు. దిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ హైవే దేశానికి ప్రాణనాడిలా మారుతుందని అన్నారు. ఇది రవాణా వేగాన్ని పెంచి డీజీవీ వృద్ధికి దోహదపడుతుందని తన ట్వీట్ట లో తెలిపారు. ఇందుకు గాను ఆనంద్ మహీంద్రా నితిన్ గడ్కరీకి ధన్యవాదాలు తెలిపారు.

English summary

Nitin Gadkari: ఏప్రిల్ 1 నుంచి ఆ వాహనాలకు 'NO' ఎంట్రీ.. నితిన్ గడ్కరీకి మహీంద్రా థ్యాంక్స్.. | 9 Lakh government vehicles go off road says union minister Nitin Gadkari

9 Lakh government vehicles go off road says union minister Nitin Gadkari
Story first published: Tuesday, January 31, 2023, 13:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X