A Oneindia Venture

8వ వేతన సంఘం వల్ల ఎవరు ఎక్కువ ప్రయోజనం పొందుతారో తెలుసా. .

8th Pay Commission: దేశవ్యాప్తంగా కేంద్ర ఉద్యోగులు,పెన్షనర్లు 8వ వేతన సంఘంలో జీతాల పెంపు గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. కేంద్రంలోని మోదీ సర్కారు 8వ వేతన సంఘాన్ని ఆమోదించింది. ఈ నిర్ణయంతో 1 కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు, పెన్షన్లు విషయంలో సవరణలు జరగనున్నాయి. జనవరి 1, 2026 నుండి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

గత వేతన సంఘంలో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమ జీతాలలో మంచి పెరుగుదలను చూశారు. తాజా 8వ కమిషన్ అమలుతో వారు మళ్ళీ తమ జీతాలలో మంచి పెరుగుదలను ఆశిస్తున్నారు. 8వ వేతన సంఘం అమలు తర్వాత 36 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ పౌర ఉద్యోగులు, పెన్షనర్లు/కుటుంబ పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. నేషనల్ కౌన్సిల్-జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (JCM) యొక్క స్టాండింగ్ కమిటీ 63వ సమావేశం ఏప్రిల్ 23, 2025న జరిగింది. ఈ సమావేశంలో NC-JCM ఉద్యోగుల సంఘం ప్రభుత్వ ఉద్యోగులకు COVID-19 కాలంలో నిలిపివేయబడిన 18 నెలల DA/DR బకాయిలను పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. ఈ సమావేశంలో ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించిన విషయాలను చర్చించారు.

8th Pay Commission pay hike for government employees revised salaries 8th CPC central government salary revision DA hike HRA revision minimum basic pay 8th CPC salary structure government employee allowances central govt pay scale 2025 pension revision 8th pay matrix salary increase news India CPC updates 8 8 8 CPC

ఇదిలా ఉంటే ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటును ప్రకటించినప్పటికీ, 8వ వేతన సంఘం ఏర్పాటు, TOR ఉత్తర్వు కోసం ఎదురుచూస్తున్నట్లు ఉద్యోగుల సంఘం తెలిపింది. COVID-19 మహమ్మారి కాలంలో ప్రభుత్వ ఉద్యోగులకు నిలిపివేసిన 18 నెలల DA/DR బకాయిలను చెల్లించాలని NC-JCM ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. ఇక 2020లో కరోనాతో ఆర్థిక పరిస్థితి దిగజారిందని, ప్రభుత్వం తీసుకున్న ఆర్థిక సంక్షేమ చర్యల కారణంగా 2020-21 ఆర్థిక సంవత్సరం తర్వాత కూడా దీని ప్రభావం కొనసాగిందని..కాబట్టి DA/DR బకాయిలను చెల్లించడం సాధ్యం కాదని ఆ శాఖ స్పష్టం చేసింది.

తాజాగా ఆమోదించిన 8పే కమిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతన సంఘం మంచి పెంపునకు దారి తీసే అవకాశం ఉంది. 8వ CPC కింద ఫిట్‌మెంట్ అంశం 2.28, 2.86 పరిధిలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీని వలన ప్రాథమిక వేతనంలో 40-50 శాతం పెరుగుదల ఉండే అవకాశం ఉంది.మీడియా నివేదికల ప్రకారం, ఫిట్‌మెంట్ అంశం 2.28 మరియు 2.86 మధ్య ఉంటే, ప్రాథమిక జీతం రూ. 46,600 నుండి రూ. 57,200 కు పెరగవచ్చు.

8వ వేతన సంఘం ప్రయోజనం పొందే కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల అధికారిక డేటా ప్రకారం, ఉద్యోగుల సంఖ్య దాదాపు 51 లక్షలు కాగా, పెన్షనర్ల సంఖ్య దాదాపు 68 లక్షలు. అంటే కొత్త వేతన సంఘం ప్రయోజనం పొందుతున్న పెన్షనర్ల సంఖ్య ఉద్యోగుల కంటే ఎక్కువగా ఉంటుంది. కాగా పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో 8వ వేతన సంఘం గురించి ప్రతిపక్షాల నుంచి ప్రశ్నలు వచ్చాయి, ఆ తర్వాత ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి 8వ వేతన సంఘం ఆమోదించామని తెలిపారు. దాదాపు 36.57 లక్షల మంది (మార్చి 1, 2025 వరకు) కేంద్ర ఉద్యోగులు, 33.91 లక్షల మంది (డిసెంబర్ 31, 2024 వరకు) పెన్షనర్లు కొత్త పే స్కేల్ కింద ప్రయోజనం పొందుతారని మంత్రి తెలిపారు. రక్షణ ఉద్యోగులు,పెన్షనర్లు కూడా దీని ద్వారా ప్రయోజనం పొందుతారన్నారు.

ఇక 8వ వేతన సంఘం ద్వారా లబ్ది పొందుతున్న వారి సంఖ్య 1 కోటి 19 లక్షలకు దగ్గరగా ఉందని ఏజీ ఆఫీస్ బ్రదర్‌హుడ్ ప్రయాగ్‌రాజ్ మాజీ అధ్యక్షుడు హరిశంకర్ తివారీ అన్నారు. ఇందులో ఉద్యోగుల సంఖ్య 36.57 లక్షలు. ఇక రక్షణ శాఖలోని దాదాపు 14 లక్షల మంది ఉద్యోగులను వారితో చేర్చితు ఉద్యోగుల సంఖ్య 51 లక్షలకు దగ్గరగా ఉంటుంది. అదే సమయంలో, 33.91 లక్షల మంది పెన్షనర్లు, దాదాపు 34 లక్షల మంది రక్షణ శాఖ నుంచి పెన్షనర్లు ఉన్నారు. ఈ లెక్కల ఆధారంగా పెన్షనర్ల సంఖ్య 68 లక్షలకు దగ్గరగా ఉంటుంది.

Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+